మొయినాబాద్‌లో ‘ట్రాఫిక్‌ జాం’ | Sakshi
Sakshi News home page

మొయినాబాద్‌లో ‘ట్రాఫిక్‌ జాం’

Published Mon, Apr 24 2017 11:05 PM

మొయినాబాద్‌లో ‘ట్రాఫిక్‌ జాం’ - Sakshi

మొయినాబాద్‌(చేవెళ్ల): అసలే సోమవారం... దానికి తోడు అర్ధంతరంగా నిలిచిన రోడ్డు పనులు.. వెరసి మొయినాబాద్‌లో భారీగా ట్రాఫిక్‌ జాం అయ్యింది. మండల కేంద్రంలో సుమారు రెండు గంటల పాటు భారీగా ట్రాఫిక్‌ జాం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు లేకపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

మొయినాబాద్‌ మండల కేంద్రంలో ప్రతి సోమవారం సంత ఉంటుంది. దీనికి తోడు మండల కేంద్రంలో రోడ్డు మరమ్మతు పనులు గత కొంతకాలంగా అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతో డివైడర్‌కు ఒకవైపు ఉన్న రోడ్డుపై నుంచే వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. సోమవారం సంత సందర్భంగా అధిక సంఖ్యలో ప్రజలు రావడంతోపాటు సాయంత్రం ఐదు గంటల సమయంలో వాహనాల రాకపోకలు పెరిగాయి. మండల కేంద్రంలో ప్రధాన చౌరస్తా వద్ద హైదరాబాద్‌-బీజాపూర్‌ రోడ్డుకు పెద్ద మంగళారం, సురంగల్‌ రోడ్లు కలుస్తాయి.

నాలుగు వైపుల నుంచి వచ్చిన వాహనాలు ఒకేసారి చౌరస్తాలో నిలవడంతో అన్ని వైపులా రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడ వాహనాలు అక్కేడే ఆగిపోయి పూర్తిగా ట్రాఫిక్‌ జాం అయ్యింది. హైదరాబాద్‌-బీజాపూర్‌ రహదారిపై రెండు వైపులా రెండు కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్‌ జాం కావడంతో వాహనాదరులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు పనులు ఎప్పుడు పూర్తవుతాయో.. ఎప్పుడు ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పుతాయోనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement