జాగ్రత్తలు పాటిస్తే కీళ్లనొప్పులు దూరం | Sakshi
Sakshi News home page

జాగ్రత్తలు పాటిస్తే కీళ్లనొప్పులు దూరం

Published Sat, Oct 22 2016 10:34 PM

జాగ్రత్తలు పాటిస్తే కీళ్లనొప్పులు దూరం

బద్వేలు అర్బన్‌: కీళ్ల నొప్పులను ప్రారంభదశలోనే గుర్తిస్తే మెరుగైన వైద్యం అందించేందుకు వీలుంటుందని  ప్రముఖ మోకాళ్ల, కీళ్ల మార్పిడి  నిపుణులు డాక్టర్‌ గోసుల శివభరత్‌రెడ్డి పేర్కొన్నారు.  ప్రపంచ అస్టియో ఫోరోసిస్‌ దినోత్సవం సందర్భంగా గోసుల క్రిష్ణారెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శనివారం  ఉచిత వైద్య శిబిరం  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థూలకాయం, ఆహారపు అలవాట్లలో నియంత్రణ లేకపోవడం వంటి కారణాలతో కీళ్లనొప్పుల సమస్యలు  ఏర్పడతాయన్నారు.  జాగ్రత్తలు పాటిస్తే వీటిని దూరం చేయొచ్చన్నారు.   ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 92 శిబిరాలను ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. ఉచిత వైద్య పరీక్షలకు సుమారు 200 మంది హాజరయ్యారు. వీరికి  పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ చేశారు.   కార్యక్రమంలో ఫిజియో థెరఫి వైధ్యులు డాక్టర్‌ షేక్‌  మహబూబ్‌ పీర్‌ పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement