2004 పుష్కరాల్లో జనసందోహం | Sakshi
Sakshi News home page

2004 పుష్కరాల్లో జనసందోహం

Published Sat, Aug 6 2016 11:41 PM

2004 పుష్కరాల్లో జనసందోహం

దామరచర్ల
2004వ సంవత్సరం ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 8వ తేదీ వరకు జరిగిన పుష్కరాల్లో జిల్లా వ్యాప్తంగా  30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే ఇందులో వాడపల్లికే 10లక్షల మంది హాజరయ్యారని రికార్డులు చెబుతున్నాయి. అదే విధంగా మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మట్టపల్లి క్షేత్రానికి 9,03,556 మంది పుష్కర భక్తులు వచ్చారు.
  ఆదాయం 30లక్షలకు పైమాటే: 2004 పుష్కరాలకు వాడపల్లికి వివిధ మార్గాల ద్వారా రూ.10లక్షల ఆదాయం వచ్చింది. హుండీల ద్వారా శ్రీమీనాక్షి అగస్త్యేశ్వర స్వామి దేవాలయంలో రూ.1.81లక్షలు,శ్రీలక్ష్మీ నరసింహ్మస్వామి దేవాలయంలో రూ.1.08లక్షలు ఆదాయం సమకూరింది.లడ్డూ ప్రసాదాల ద్వారా రూ.3.91లక్షలు,శ్రీఘ్రదర్శనం ద్వారా రూ.1.49లక్షలు ఆదాయం వచ్చింది. మట్టపల్లిలో వివిధ మార్గాల ద్వారా రూ.21,39,643 ఆదాయం వచ్చింది.


 

Advertisement
Advertisement