శ్రీవారి ఆలయంలోనూ పెద్ద నోట్లు చెల్లవు | Sakshi
Sakshi News home page

శ్రీవారి ఆలయంలోనూ పెద్ద నోట్లు చెల్లవు

Published Thu, Dec 22 2016 11:58 PM

శ్రీవారి ఆలయంలోనూ పెద్ద నోట్లు చెల్లవు

ద్వారకాతిరుమల : ప్రభుత్వం రద్దుచేసిన రూ.1000, రూ.500 నోట్లు ఇకపై శ్రీవారి ఆలయంలోనూ చెల్లవు. ఈ రౖద్దైన నోట్లతో ఇప్పటి వరకు పలువురు యాత్రికులు అనేక సేవలు పొందారు. ఇకపై అలాంటి అవకాశం లేదు. పెద్దనోట్లు రద్దు చేసినప్పటి నుంచి ప్రజలు ఎన్నో నగదు కష్టాలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆ కష్టాలు చినవెంకన్న క్షేత్రంలో పెద్దగా కనబడలేదు. దీనికి ప్రధాన కారణం అన్ని రకాల సేవలు, కొనుగోళ్లకు దేవస్థానం రద్దైన నోట్లను అనుమతించింది. దీంతో చిల్లర సమస్య కూడా ఇక్కడ తలెత్తలేదు. అయితే ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం రౖద్దైన పాత పెద్దనోట్లు బ్యాంకుల్లో మాత్రమే చెల్లుబాటు అవుతాయని, మరెక్కడా చలామణీ కావని స్పష్టం చేయడంతో ఆలయ అధికారులు గత రెండు రోజుల క్రితం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భక్తులకు ఈ విషయాన్ని తెలియజేయడం కోసం ఆలయ ప్రాంగణంలో పలు చోట్ల బోర్డులను ఏర్పాటు చేశారు. యాత్రికులు హుండీల్లో సమర్పించే పెద్ద నోట్లను మాత్రమే బ్యాంకుకు జమచేయాలని ఆలయ అధికారులకు బ్యాంకర్లు ఇప్పటికే సూచించారు. అది కూడా ఈనెల 30న ఒకేసారి హుండీ సొమ్మును డిపాజిట్‌ చెయ్యాలని పేర్కొన్నారు. దీంతో  ఆలయంలో ఇకపై రద్దైన నోట్లు చెల్లవని ఈవో వేండ్ర త్రినాథరావు సూచించారు.  భక్తులు సహకరించాలని కోరారు. 
 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement