దళితులపై దాడులు పెరిగాయి: కేవీపీఎస్ | Sakshi
Sakshi News home page

దళితులపై దాడులు పెరిగాయి: కేవీపీఎస్

Published Tue, Aug 2 2016 8:18 PM

increased attacks on Dalits

బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాకే దళితులపై దాడులు పెరిగాయని పలువురు వక్తలు విమర్శించారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి(కెవిపిఎస్) ఆధ్వర్యంలో గుజరాత్‌లోని దళితులపై దాడులను ఖండిస్తు సమావేశాన్ని నిర్వహించారు.

 

ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మాజీ కార్యదర్శి జాన్‌వెస్లీ, టిపిఎస్‌కె కన్వీనర్ జి.రాములు, బిసి సబ్ ప్లాన్ సాధన సమితి కన్వీనర్ కిల్లే గోపాల్, డీబీఎస్ అధ్యక్షులు శంకర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.వారు మాట్లాడుతూ బీజేపీ ఒక నాడు ముస్లీం మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని అధికారంలోకి వచ్చిందని, నేడు దళితులను లక్ష్యంగా చేసుకొని బ్రాహ్మణీయ అధిపత్యాన్ని సాధించి హిందూ రాజ్యంగా మార్చటానికి కుట్ర చేస్తుందని వారు విమర్శించారు.

 

గుజరాత్‌లోని ఊనలో గోరక్షక సమితి వారు నలుగురు దళితులపై విచక్షణ రహితంగా దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవటం సిగ్గు చేటు అని వారు అన్నారు. గుజరాత్ దళితులు చేస్తున్న ఆందోళనకు తాము కూడ మద్దతు ఇస్తున్నామని వారు చెప్పారు. వారికి మద్దతుగా పెద్ద ఎత్తున త్వరలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు జి.నాగయ్య, రాములు, ఆర్.శ్రీరాం నాయక్, సత్తార్, ఎం.డి.అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement