ఇందూరు విద్యార్థులకు బహూమతి | Sakshi
Sakshi News home page

ఇందూరు విద్యార్థులకు బహూమతి

Published Mon, Jul 25 2016 8:02 PM

ఇందూరు విద్యార్థులకు బహూమతి

సిద్దిపేట రూరల్‌:సిద్దిపేట మండలంలోని పొన్నాల ఇందూరు ఇంజనీరింగ్‌ కళాశాల సీఎస్‌ఈ ఫైనల్‌ ఇయర్‌కు చెందిన వి. సాయికిరణ్, మహ్మదీయా నాజ్‌లు సామ్‌సంగ్‌ మోబైల్‌లో యాప్‌ ఆవిష్కరించడంలో మొదట బహుమతిని పొందారు. సోమవారం హైదారాబాద్‌లోని తెలంగాణ అకాడమీ ఇందూరు విద్యార్థులకు బహూమత
ిఫర్‌ స్కీల్స్‌
అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) కార్యాలయంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో విద్యార్థులు సామ్‌సంగ్‌ మోబైల్‌ యాప్‌ ఆవిష్కరణపై ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో ఇందూరు విద్యార్థులు వి. సాయికిరణ్‌ (భగవద్గీత యాప్‌), మహ్మదీయా నాజ్‌ (ఆల్‌ ఖురాన్‌ యాప్‌)లను రూపొందించారు. దీనిలో భాగంగా ఇద్దరు విద్యార్థులకు మొదటి బహుమతి ప్రకటించి, మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా బహుమతిని అందుకున్నట్లు ఇందూరు కళాశాల ప్రిన్సిపల్‌ ప్రభూజీ బెన్‌కాఫ్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎస్‌ఈ హెచ్‌ఓడీ అశోక్‌ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులను కళాశాల అధ్యాపక బృం‍దం అభినందించారు.

 

Advertisement
Advertisement