దశబ్దాలుగా వాల్మీకులకు అన్యాయం | Sakshi
Sakshi News home page

దశబ్దాలుగా వాల్మీకులకు అన్యాయం

Published Mon, Oct 10 2016 12:38 AM

injustice to valmikis

కర్నూలు(అర్బన్‌): దశబ్దాలుగా వాల్మీకులు అన్యాయానికి గురవుతున్నారని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీటీ నాయుడు అన్నారు. ఆదివారం స్థానిక బీ క్యాంప్‌లోని బీసీ భవన్‌లో జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వాల్మీకి కులానికి చెందిన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకులను ఎసీ​‍్ట జాబితాలో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సత్యపాల్‌ కమిటీని నియమించిందన్నారు.

వాల్మీకులకు న్యాయం చేయాలనే సంకల్పంతో సీఎం ఉన్నారన్నారు. జిల్లా అధ్యక్షుడు బుర్రా ఈశ్వరయ్య మాట్లాడుతు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే పోరాట కమిటీ అధ్వర్యంలో ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. సమావేశంలో వాల్మీకి సంఘం నాయకులు సుబ్రమణ్యం, పాలెగార్‌ సత్యనారాయణ రాజు, రామకృష్ణ, యాపలయ్య, కృష్ణ, అనుమంతు, బీసీవీఎస్‌ జిల్లా అధ్యక్షుడు రంగమునినాయుడు, ఏవీ నాయుడు, రమణ, చిత్రసేనుడు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement