తహసీల్దార్‌కు అవమానం | Sakshi
Sakshi News home page

తహసీల్దార్‌కు అవమానం

Published Sat, Jun 3 2017 7:39 PM

insult to tahasildar in kambadur

కంబదూరు : మండలంలో జరిగిన నవనిర్మాణ దీక్షలో తహసీల్దార్‌ రఫీక్‌అహ్మద్‌కు అవమానం జరిగింది. రాష్ట్ర  ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ నవనిర్మాణ దీక్ష టీడీపీ  సొంత కార్యక్రమంలా మారింది. శనివారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన నవనిర్మాణ దీక్ష కార్యక్రమానికి ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ వేదికపైకి తహసీల్దార్‌ రఫీక్‌అహ్మద్‌ను పిలువకుండా ఎమ్మెల్యే ఉన్నం, జెడ్పీటీసీ సభ్యుడు రామ్మోహన్‌చౌదరి, ఎంపీపీ దండా గోవింద్‌చౌదరి, టీడీపీ మండల కన్వీనర్, పార్టీ జిల్లా కార్యదర్శి, ఎస్సీ సెల్‌ అ«ధ్యక్షుడు, మిగిలిన టీడీపీ నాయకులు ఆశీనులైయ్యారు. దీంతో ఎమ్మెల్యే  సాక్షిగా మండల మెజిస్ట్రేట్‌ అయిన తహసీల్దార్‌ను కార్యక్రమం ముగిసేంత వరకు వేదిక కిందే కూర్చోబెట్టి అవమాన పరిచారు. తహసీల్దార్‌కే గౌరవం లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని మండలవాసులు విస్తుపోయారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement