నగరంలో ఇంటెలిజెంట్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టం! | Sakshi
Sakshi News home page

నగరంలో ఇంటెలిజెంట్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టం!

Published Thu, Jan 26 2017 2:29 AM

నగరంలో ఇంటెలిజెంట్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టం!

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఇంటెలిజెంట్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టం ఏర్పాటవుతున్న తొలిన గరంగా హైదరాబాద్‌కు గుర్తింపు రానుంది. ప్రజా రవాణాలో కీలకంగా ఉన్న ఆర్టీసీ బస్సు ల నిర్వహణను క్రమబద్ధం చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది. ప్రజా రవాణా వ్యవస్థను గొప్పగా నిర్వహించటంలో ఫ్రాన్స్‌ దేశానికి మంచి పేరుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో తొలుత ఈ వ్యవస్థను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసే అవకాశాన్ని ఆ దేశానికి చెందిన లూమీప్లాస్‌ కంపెనీకి అప్పగించారు. గతేడాది అక్టోబర్‌లో ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లిన సమయంలో ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, ఆర్టీసీ ఎండీ రమణారావు ఆ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. బుధవారం ఈ మేరకు నగరంలో ఆర్టీసీ బస్సులకు ఇంటెలిజెంట్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టం ఏర్పాటు చేసేందుకు ఆ కంపెనీ ప్రతినిధులు నగరానికి వచ్చారు. ప్రయోగాత్మకంగా తొలుత ఓ మార్గాన్ని వారికి అప్పగించారు. అక్కడ తమ సాంకేతిక పరిజ్ఞానంతో దాని అమలును పరిశీలిస్తారు. అది సత్ఫలితాలనిస్తే నగరం మొత్తం ఏర్పాటు చేస్తారు.

మొత్తం ఖర్చు ఫ్రాన్స్‌ కంపెనీదే
ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు కోసం ఉప్పల్‌–కోఠి మార్గాన్ని ఫ్రెంచి కంపెనీ కి అప్పగించారు. ఆ మార్గంలోని 40 బస్సుల్లో దీన్ని ఏర్పాటు చేసి.. అవి తిరిగే బస్టాప్‌లతో అనుసంధానిస్తారు. ఇందుకు రూ.20 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ మొత్తాన్ని ఫ్రెంచి కంపెనీనే భరి స్తుంది. మరో రెండు నెలల్లో ఈ వ్యవస్థ ప్రారం భమవుతుంది. 6 నెలలపాటు దాని ఫలితాలు పరిశీలిస్తారు. హైదరాబాద్‌ రోడ్లకు అనుకూలంగా ఉంటే మొత్తం నగరానికి విస్తరి స్తారు. అనుకూలంగా లేనిపక్షంలో.. ప్రయో గం కోసం అయిన ఖర్చుతో ఆర్టీసీకి సంబం ధం ఉండదు. ఇప్పటివరకు దేశంలో ఇలాంటి వ్యవస్థ మరే నగరంలోనూ ఏర్పాటు కాలేదు. దీన్ని మొబైల్‌ యాప్‌తో అనుసంధానించి అందుబాటులోకి తెచ్చే ఏర్పాటు కూడా చేస్తు న్నారు. ఆ యాప్‌ వల్ల వచ్చే అరగంటలో బస్సుల గమనం కచ్చితంగా తెలుసుకునే అవ కాశం ఉంటుందని అధికారులు అంటున్నారు.

ఫ్రాన్స్‌తో కలసి పనిచేస్తాం: మేయర్‌ బొంతు రామ్మోహన్‌
హైదరాబాద్‌లో భూగర్భ పార్కింగ్‌ ఏర్పా టు, సబ్‌–వేల నిర్మాణం, గ్రీనరీ, ల్యాండ్‌ స్కేపింగ్‌ల అభివృద్ధికి ఫ్రాన్స్‌ సహాయం తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ పేర్కొన్నారు. నగరం లో ట్రామ్‌–వే ఏర్పాటుకు ఫ్రెంచ్‌ బృందం తో కొద్ది రోజులుగా సమావేశాలు నిర్వ హిస్తున్న విషయాన్ని మేయర్‌ రామ్మోహన్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఏంటా పరిజ్ఞానం..
భాగ్యనగరంలో 4 వేల సిటీ బస్సులు తిరుగు తున్నాయి. ట్రాఫిక్‌లో చిక్కుకుని ఏ బస్సు ఎప్పుడొస్తుందో తెలియని గందరగోళం నెలకొంది. బస్సు కోసం వేచి చూసి ఎప్పుడొస్తుందో తెలియక ప్రయాణికులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. దీన్ని నివారించి బస్సుల నిర్వహణను జీపీఎస్‌ పద్ధతితో క్రమబద్ధం చేయడమే ఈ విధానం. బస్సుల్లో జీపీఎస్‌ను ఏర్పాటు చేసి.. బస్టాప్‌లలో అనుసంధాని స్తారు. సౌర శక్తితో పని చేసే డిస్‌ప్లే బోర్డులను ఏర్పా టు చేస్తారు. ఏ నంబరు బస్సు ఎంత సేపట్లో ఆ బస్టాప్‌నకు వస్తుందో డిస్‌ప్లే బోర్డుల్లో కనిపిస్తుంది. ఏ బస్సు ఎక్కడుందో మ్యాప్‌లో కనిపిస్తుంది. వచ్చే బస్టాప్‌ పేరు, ఎంత సేపట్లో అక్కడికి బస్సు చేరుకుంటుందనేది బస్సుల్లో ముందుగా ప్రకటి స్తారు. బస్టాప్‌లలో ఆగకుండా వెళ్లిన బస్సులు, వాటి వేగం, ఎన్ని బస్సులు ట్రాఫిక్‌లో చిక్కుకుని ఉన్నా యి, ఎన్ని బస్సులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయనే వివరాలన్నీ కంట్రోల్‌ రూమ్‌లో తెలిసిపోతాయి.

పరిశీలించిన మంత్రి మహేందర్‌రెడ్డి
సీఎం చంద్రశేఖర్‌రావు విశ్వనగర ఆలోచనకు ఇది ప్రతిరూపమని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నా రు. ఫ్రెంచి కంపెనీ ప్రతినిధులు, ఆర్టీసీ చైర్మన్‌ సత్యనారాయణ, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ, జీహెచ్‌ ఎంసీ మేయర్‌ రామ్మోహన్, ఆర్టీసీ ఎండీ రమణారావు, ఇతర అధికారులతో కలసి బస్‌భవన్‌లో ఆయన ఈ విధానాన్ని పరిశీ లించారు. ఏ బస్సు ఎక్కడుంది.. ఎంత సేపటిలో వస్తుంది.. తదితర కచ్చిత వివ రాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని, వచ్చే స్టాపుల వివరాలు ముందే తెలుసుకునే అవకాశం కలుగు తుందని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు ఫ్రెంచి ప్రతినిధులు సీఎస్‌ ఎస్పీ సింగ్‌కు సచివాలయంలో ఈ విధానం గురించి వివరించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు ఇలాంటి విధానం చాలా అవసరమని సీఎస్‌ అభిప్రాయపడ్డారు.
 

Advertisement
Advertisement