ఉత్తమ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

9 Sep, 2016 23:12 IST|Sakshi
పోచమ్మమైదాన్‌ :జిల్లాలో సమాజ సేవ చేస్తున్న యువత, మహిళా సంఘాలను ప్రోత్సహించేందుకు 2015–2016 సంవత్సరానికి గాను జిల్లా ఉత్తమ యువజన సంఘం అవార్డుల ఎంపికకు దరఖాస్తు లు ఆహ్వానిస్తున్నట్లు నెహ్రూ యువ కేం ద్ర జిల్లా కోఆర్డినేటర్‌ మనోరంజన్‌ తెలి పారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన చేశారు. నెహ్రూ యువకేంద్రంలో అఫిలియేషన్‌ పొందిన వారే అవార్డులకు అర్హులని పేర్కొన్నారు. రిజి స్ట్రేషన్‌ అయి మూడేళ్లు కావాలని, సభ్యు లు 14 – 29 మధ్య వయసు వారై ఉండాలని సూచించారు.
 
మూడేళ్ల ప్రగతి నివేదిక, ఆడిట్‌ రిపోర్టు, కార్యక్రమాల ఫొటో లు, పేపర్‌ కటింగ్‌ జిరాక్స్‌లను దరఖాస్తుతో జతచేసి, ఈనెల 25 లోగా హన్మకొండ లోని ఎన్‌వైకే కార్యాలయంలో అం దజేయాలని సూచించారు. వివరాలకు 0870–2578776 నంబర్‌లో సంప్రదిం చాలని కోరారు. 
 
మరిన్ని వార్తలు