సర్వేలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు | Sakshi
Sakshi News home page

సర్వేలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

Published Sat, Aug 13 2016 10:09 PM

irresponsiblity staff in survey

  • రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ విజయకృష్ణన్‌
  • నలుగురి సస్పెన్షన్‌కు సిఫారసు
  •  
    రాజమహేంద్రవరం రూరల్‌ : 
    ప్రజాసాధికార సర్వేలో ఎన్యుమనేటర్లు, సూపర్‌వైజర్లు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం హుకుంపేటలోని మండల పరిషత్‌ కార్యాలయ సమావేశం మందిరంలో సర్వే చేస్తున్న సిబ్బందితో తహసీల్దార్‌ భీమారావు అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. సబ్‌కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజాసాధికార సర్వేలో రూరల్‌ మండలం చివరి నుంచి ఎనిమిదవ స్థానంలో ఉందన్నారు. 30.48శాతం మాత్రమే పూర్తి చేశారన్నారు. రోజుకు 14 కుటుంబాలు చొప్పున సర్వే పూర్తి చేయాలని, కాని అధికశాతం మంది తొమ్మిది కుటుంబాలు కూడా చేయడం లేదన్నారు. మండలంలో 45,271 ఇళ్లు ఉండగా 16,852 ఇళ్ల సర్వే మాత్రమే పూర్తి చేశారన్నారు. 1,89,651మంది జనాభాకు  47,516 మంది సర్వే పూర్తయిందన్నారు. 
    నలుగురి సస్పెన్షన్‌కు సిఫారసు : ప్రజాసాధికార సర్వేలో అతి తక్కువ కుటుంబాలు చేసిన నలుగురి ఉద్యోగులపై  ఉన్నతాధికారులకు సస్పెన్షన్‌కు సిఫారసు చేయనున్నట్టు సబ్‌ కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు. శాటిలైట్‌సిటి పంచాయతీ కార్యదర్శి పద్మజ, వెలుగు యానిమేటర్‌ మున్నీషా, బొమ్మూరు పంచాయతీ జూనియర్‌ అసిస్టెంట్‌ తోటబాబు, కాతేరు ఉపాధిహామీ ఫీల్డ్‌అసిస్టెంట్‌ సుందరకుమార్‌లపై ఆగ్రహం వ్యక్తంచేసి తహసీల్దార్‌ భీమారావును సస్పెన్షన్‌కు సంబంధించి ఆర్డర్లును సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎంపీడీవో ఎ.రమణారెడ్డి, డిప్యూటి తహసీల్దార్‌ సురేష్‌బాబు, ఏఎస్‌వో కొల్లి ప్రసాద్, సూపర్‌వైజర్లు, ఎన్యుమనేటర్లు పాల్గొన్నారు. 
     

Advertisement

తప్పక చదవండి

Advertisement