మోడల్ స్కూల్ను ప్రారంభించిన మంత్రి

27 Aug, 2015 13:41 IST|Sakshi

నల్లగొండ : నల్లగొండ జిల్లా వేములపల్లిలో నూతనంగా నిర్మించిన ఆదర్శ పాఠశాల హాస్టల్ భవనాన్ని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. తొలిసారిగా మంత్రి జగదీష్రెడ్డి మండల కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలకాలని పార్టీ నాయకులు మిర్యాలగూడ నియోజక వర్గ టీఆర్‌ఎస్ పార్టీ ఇంఛార్జి అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు తేరా చెన్నపురెడ్డి గ్రామ శివారులో వేచి చూస్తున్నారు.

కానీ మంత్రి వాహనాన్ని అక్కడ ఆపకుండా.. నేరుగా హాస్టల్ భవనం వద్దకు చేరుకుంది. దాంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. కాగా... మంత్రికి అత్యవసర పనులు ఉండటంతోనే.. ఎక్కువ సమయం కేటాయించలేక పోయారని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలను సముదాయించినట్లు సమాచారం.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా