పార్కుతో పరుగులే! | Sakshi
Sakshi News home page

పార్కుతో పరుగులే!

Published Mon, Nov 7 2016 4:34 AM

పార్కుతో పరుగులే! - Sakshi

‘జిన్నింగ్’ పూర్వవైభవానికి  తోడ్పడనున్న టెక్స్‌టైల్ పార్కు
{పెస్సింగ్, జిన్నింగ్ మిల్లులు అభివృద్ధి చెందే అవకాశం
పత్తి రైతులు, వ్యాపారులకు   మేలు.. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు

 
గీసుకొండ : వరంగల్ రూరల్ జిల్లాలోని గీసుకొండ-సంగెం మండలాల పరిధిలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటైతే ఈ ప్రాంతంలోని పత్తి, జిన్నింగ్ ప్రెస్సింగ్ మిల్లుల వ్యాపార అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది. గతంలో గొర్రెకుంట ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలో జోరుగా సాగిన జిన్నింగ్ వ్యాపారం కొన్నేళ్లుగా ప్రతికూల పరిస్థితుల కారణంగా మందగించింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం భూసేకరణను వేగంగా చేపడుతోంది. ఇదంతా పూర్తరుు పార్కు అందుబాటులోకి వస్తే ఇక్కడ జిన్నింగ్, ప్రెస్సింగ్ వ్యాపారం అభివృద్ధి చెందడంతో కార్మికులు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నారుు. అలాగే, ఎగుమతి విషయంలో ఇబ్బంది పడుతున్న వ్యాపారులకు కలిసొస్తుందని, రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని చెబుతున్నారు.
 
వ్యాపారులకు తొలగనున్న ఇబ్బందులు
జిల్లాలోని గొర్రెకుంట ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలో పెద్దసంఖ్యలో పత్తి మిల్లులు ఏర్పాటయ్యారుు. ఆ తర్వాత క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, తొర్రూరు, నెక్కొండ, ములుగు, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్ ప్రాంతాలకు విస్తరించారుు. అరుుతే, ఈ మిల్లుల్లో ఉత్పత్తి అరుున పత్తి బేళ్లను ఎక్కువగా తమిళనాడుకు, ఆ తర్వాత గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని స్పిన్నింగ్ మిల్లులకు ఎగుమతి చేస్తున్నారు. అక్కడి వ్యాపారుల తీరుతో పాటు రవాణా విషయంలో వ్యయప్రయాసల కారణంగా జిల్లాలోని ప్రెస్సింగ్ మిల్లుల వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి నుంచి తమిళనాడుకు ఎగుమతి చేసిన బేళ్ల విషయంలో అక్కడి వ్యాపారులు అనేక సాకులు చూపి తక్కువ ధర చెల్లిస్తున్నారు. ఫలితంగా వ్యాపారులు నష్టపోతుండగా.. చిన్న వ్యాపారులు ఆర్ధికంగా దవాళా తీస్తూ మిల్లులను మూసివేస్తున్నారు. ఈ మేరకు స్థానికంగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటైతే ఇతర రాష్ట్రాలకు బేళ్లను ఎగుమతి చేయాల్సిన దుస్థితి ఉండదు. ఇక్కడ తయారైన బేళ్లను టెక్స్‌టైల్ పార్కులో స్పిన్నింగ్, వస్త్రాల తయారీ కోసం ఉపయోగించవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. తద్వారా జిన్నింగ్, ప్రెస్సింగ్ వ్యాపారం అభివృద్ధి చెందడంతో పాటు పాటు పత్తి రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. అంతే కాకుండా కార్మికులు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతారుు.
 
ముమ్మరంగా భూ సేకరణ
ఇదిలా ఉండగా గీసుకొండ-సంగెం మండలాల పరిధిలో టెక్స్‌టైల్ పార్కు కోసం భూసేకరణ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే రెవెన్యూ శాఖ అధికారులు భూ సేకరణలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు 800 ఎకరాలు సేకరించినట్లు గీసుకొండ తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. త్వరలోనే మొత్తం భూమి సేకరించి అప్పగిస్తే ప్రభుత్వం టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుచేయనుంది.

టెక్స్‌టైల్ పార్కు వస్తే ఎంతో మేలు

 వరంగల్ రూరల్ జిల్లాలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం భూసేకరణ చేస్తోంది. త్వరగా పార్కు ఏర్పాటైతే రాష్రంలోనే కాకుండా, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పత్తి, జిన్నింగ్ వ్యాపారం ఊపందుకుంటుంది. తద్వారా వ్యాపారులకు, రైతులకు మేలు జరుగుతుంది. - నూనేటి భాస్కర్, ప్రెస్సింగ్ మిల్లు వ్యాపారి

 చిన్న వ్యాపారులకు మేలు
టెక్స్‌టైల్ పార్కు వస్తే ప్రెస్సింగ్ మిల్లులను నడిపే చిన్న వ్యాపారుల ఇబ్బందులు తొలిగిపోతారుు. పెద్ద వ్యాపారుల రీతిలో లాభాలు కళ్ల చూసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉత్పత్తి అరుున పత్తి బేళ్లను గతంలో మాదిరిగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాల్సిన అవసరం ఉండదు. - తొర్రూరు రామన్న, ప్రెస్సింగ్ వ్యాపారి

Advertisement
Advertisement