జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో వరద | Sakshi
Sakshi News home page

జూరాలకు తగ్గిన ఇన్‌ఫ్లో వరద

Published Wed, Aug 17 2016 12:57 AM

Jorala inflow sloly

జూరాల : జూరాల ప్రాజెక్టుకు పై నుంచి మంగళవారం ఇన్‌ఫ్లో వరద తగ్గింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం  9.62 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. పై నుంచి ఇన్‌ఫ్లో 30వేల క్యూసెక్కులు వస్తుండగా జలవిద్యుత్‌ కేంద్రంలో మూడు టరై్బన్లలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తూ 28,115 క్యూసెక్కుల వరదను దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్‌ ద్వారా కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టులకు ఎత్తిపోతల ద్వారా పంపింగ్‌ కొనసాగిస్తున్నారు. కష్ణానది పై ప్రాంతంలోని కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 122 టీఎంసీల నీటినిల్వ ఉంది. పై నుంచి ప్రాజెక్టుకు 75,590 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా విద్యుదుత్పత్తి ద్వారా 15వేల క్యూసెక్కులను దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు క్రస్టుగేట్లన్నీ మూసివేశారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు దిగువన కర్ణాటకలోనే ఉన్న నారాయణపూర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 32 టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. పై నుంచి 18,138 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వరద వస్తుండగా విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 6వేల క్యూసెక్కులను దిగువన ఉన్న జూరాల రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌ ప్రాజెక్టులోనూ అన్ని క్రస్టుగేట్లను మూసివేశారు. 

Advertisement
Advertisement