19 మంది విద్యార్థులకు 8 మంది ఉపాధ్యాయులా? | Sakshi
Sakshi News home page

19 మంది విద్యార్థులకు 8 మంది ఉపాధ్యాయులా?

Published Tue, Sep 5 2017 10:11 AM

19 మంది విద్యార్థులకు 8 మంది ఉపాధ్యాయులా?

వడ్లకొండ ఉన్నత పాఠశాల ఎత్తివేస్తాం
అందరు ఏకమైతేనే సర్కారు స్కూళ్లు బతుకుతాయి
డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి


పర్వతగిరి(వర్ధన్నపేట): నెలకు సుమారు రూ.5లక్షలు జీ తాలు చెల్లించి 19 మంది విద్యార్థులకు చదువు చెప్పించటం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. సోమవారం మండలంలోని వడ్లకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రైతు సమస్వయ సమితి ఏర్పాటు కోసం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ అధ్యక్షత జరిగిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని గ్రామస్తులు మంత్రికి వినతిపత్రం సమర్పించారు.

పాఠశాలల్లో 19 మంది విద్యార్థులకు 8 మంది ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది ఉన్న విషయం తెలుసుకున్న మంత్రి బడిబాటలో ఎందుకు ఎల్‌రోల్‌ మెం ట్‌ కావటం లేదని ఎంఈఓ అజామోహీనొద్దీన్‌ను అడిగా రు. దగ్గరలో ప్రైవేట్‌ స్కూల్‌ ఉండడంతో పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు రావటం లేదని చెప్పగా.. ఉపాధ్యాయుల పనితీరు సరిగా లేక, బడికి సక్రమంగా హాజరు కాకపోవటం వల్లే విద్యార్థులు రావటం లేదని కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో 90 మందికి పైగా విద్యార్థులు ప్రైవేట్‌ స్కూల్‌కు వెళ్తుంటే ప్రజలు ఎందుకు అడ్డుకోవటం లేదని ప్రశ్నించారు. పిల్లలను ప్రభుత్వ బడిలో చది వించాలనే చిత్తశుద్ధి తల్లిదండ్రుల్లో లేదని, పాఠశాలను ఎత్తివేసి విద్యార్థులను పర్వతగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేర్పించి ఉపాధ్యాయులను మరో చోటికి మారుస్తామన్నారు.

పాఠశాలను మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీలు నడిపించరు.. గ్రామస్తులే నడిపించాలి.. కొన్ని గ్రామాల్లో గ్రా మస్తులు ఏకమై పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ ప్రైవేట్‌ స్కూళ్ల బస్సులను అడ్డుకుంటున్నారని చెప్పారు. అందరూ ఐక్యంగా ఉండి పిల్లలను పంపినప్పుడే సర్కారు స్కూళ్లు బతుకుతాయని పేర్కొన్నారు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో 20 మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్లు ఉన్నారని, వాటి విషయంలో డీఈఓ, ఎంఈఓలతో చర్చించి ఇంగ్లిష్‌ మీడియం ఏర్పాటు చేసి ఉన్నత పాఠశాలను ఎత్తివేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ ఏడుదొడ్ల జితేందర్‌రెడ్డి, డైరెక్టర్‌ యుగేందర్‌రావు, జెడ్పీటీసీ మదాసి శైలజ, ఆర్డీఓ మహేందర్‌జీ, పశు సంవర్థక శాఖ జేడీ వెంకయ్యనాయుడు, ఎంపీటీసీ పట్టాపురం తిరుమల, రైతులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement