పేదల బతుకుపై కిరోసిన్‌ భారం | Sakshi
Sakshi News home page

పేదల బతుకుపై కిరోసిన్‌ భారం

Published Fri, Oct 28 2016 11:59 PM

పేదల బతుకుపై కిరోసిన్‌ భారం

  • జిల్లాపై సుమారు రూ.42 లక్షలు అదనపు భారం
  • పొగ రహిత జిల్లాగా మార్చేందుకేనని చెబుతున్న యంత్రాంగం
  • ఆందోళనలో కార్డుదారులు
  • రామచంద్రపురం రూరల్‌/ కాకినాడ సిటీ : 
    రాష్ట్రంలోని పేదల బతుకులపై దీపావళి కానుకగా టీడీపీ ప్రభుత్వం కిరోసి¯ŒS బాంబు పేల్చనుంది. చలికాలంలో వెచ్చగా వాత పెట్టనుంది. ఈ మేరకు ఇప్పటికే తహశీల్దార్‌ కార్యాలయాల నుంచి డీలర్లకు వచ్చే నెల నుంచి పెంచిన మొత్తంతో  
    డీడీలు తీయాల్సిందిగా ఆదేశాలందాయి. ఈ పెంపు పేదల పాలిట పెనుభారం కానుంది. జిల్లాలో దీపావళి అనంతరం గ్యాస్‌ కనెక్ష¯ŒS ఉన్న తెలుపు రేష¯ŒS కార్డుదారులకు సుమారుగా రూ.42 లక్షలు అదనపు భారం పడనుంది. జిల్లాలో తెలుపు రేష¯ŒS కార్డులతోపాటు గ్యాస్‌ కనెక్ష¯ŒS ఉన్న వారు 10, 50, 321 కుటుంబాలున్నాయి.గ్యాస్‌ కనెక్ష¯ŒS లేని తెలుపు కార్డుదారులు 4, 68, 660 కుటుంబాలున్నాయి. అయితే గ్యాస్‌ కనెక్ష¯ŒS ఉన్న తెలుపు కార్డుదారులకు ఒక లీటరు, గ్యాస్‌ కనెక్ష¯ŒS లేని కుటుంబాలకు రెండు లీటర్లు చొప్పున కిరోసి¯ŒS అందిస్తున్నారు. ఈ లెక్కన లీటరుకు రూ.15లు చొప్పున ప్రతి నెలా సుమారుగా రూ.2.98 కోట్లు విలువైన కిరోసి¯ŒSను తెలుపు రేష¯ŒS కార్డుదారులు వినియోగిస్తున్నారు. ప్రస్తుతం లీటరుకు గ్యాస్‌ కనెక్ష¯ŒS ఉన్న తెలుపు రేష¯ŒS కార్డుదారులకు రూ.4లు పెంచటంతో లీటరు రూ 9లు పెరగనుంది. ఈ లెక్కన ప్రతి నెలా జిల్లాలోని గ్యాస్‌ కనెక్ష¯ŒS వినియోగదారులపై సుమారు 42 లక్షలు భారం పడనుంది. 
     
    రెండు రోజుల తరువాత...
    ఇప్పటి వరకు పేదలకు లీటరు కిరోసి¯ŒS రూ.15కు అందిస్తున్నారు.నవంబరు ఒకటో తేదీ నుంచి కిరోసి¯ŒS లీటరు ధర రూ.19 కానుంది. డీలర్లు లీటరు కిరోసి¯ŒS రూ14.75 పైసలు చెల్లించి పావలా కమిషను కలుపుకుని రూ.15కు విక్రయించేవారు. నవంబరు నుంచి రూ.18.75 పైసలకు డీడీలు తీయవలసిందిగా వారికి ఆదేశాలు రావడంతో రూ.4లు నవంబరు నుంచి పేదలపై భారం పడనుంది. దీనిపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రేష¯ŒS కార్డుదారులకు వంట గ్యాస్‌ కనెక్ష¯ŒS ఉన్న వారికి ఒక లీటరు, గ్యాస్‌ కనెక్ష¯ŒS లేనివారికి రెండు లీటర్లు చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఈ లెక్కన ప్రతీ కార్డుదారునికి రూ.8 లెక్కన ఆర్థిక భారం పడనుంది. పేదలు ఎక్కువగా ఉపయోగించుకునే కిరోసి¯ŒS ధర పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌ పేదల్లో వ్యక్తమవుతోంది.
     
    నవంబర్‌ నుంచి అమలు
    ప్రభుత్వం పెంచిన ధర నవంబర్‌ నెల కోటా నుంచి అమలులోకి వస్తుంది. దీపం పథకం ద్వారా ప్రతి కార్డుదారునికి గ్యాస్‌ కనెక్ష¯ŒS ఇవ్వాలనే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించాం. తద్వారా జిల్లాను పొగ రహితంగా మార్చే చర్యలు తీసుకుంటున్నాం.
    – జి.ఉమామహేశ్వరరావు, జిల్లా పౌరసరఫరాలశాఖాధికారి
     
    ధర పెంపు సరికాదు 
    రేష¯ŒS షాపు ద్వారా ఇచ్చే కిరోసి¯ŒS ధరను పెంచడం సరికాదు. గ్యాస్‌ కనెక్ష¯ŒS లేనివారు, చాలా మంది వర్షాల సమయంలో కిరోసి¯ŒS ఆధారంగానే వంటలు చేసుకుంటారు. అలాంటిది కిరోసి¯ŒS ధరను పెంచడంతో వారంతా ఇబ్బందులు పడతారు. ప్రభుత్వం దీనిపై పునరాలోచించాలి. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి.
    – కట్టా సూర్యనారాయణ, మాజీ మండలాధ్యక్షుడు,
    వైఎస్సార్‌ సీపీ నాయకుడు, రామచంద్రపురం  
     
    ప్రస్తుతం
    వివరం పరిమాణం లీటరుకు ధర వ్యయం
    గ్యాస్‌ కనెక్ష¯ŒS లేని తెలుపు కార్డుదారులు 468660 2 లీటర్లు రూ. 15 రూ. 14059800
    గ్యాస్‌ కనెక్ష¯ŒS ఉన్న తెలుపు కార్డుదారులు 1050321 1 లీటరు రూ. 15 రూ. 15754815
    పెంపు తరువాత
    వివరం పరిమాణం లీటరుకు ధర భారం
    గ్యాస్‌ కనెక్ష¯ŒS లేని తెలుపు కార్డుదారులు 468660 2 లీటర్లు రూ. 15 రూ. 14059800
    గ్యాస్‌ కనెక్ష¯ŒS ఉన్న తెలుపు కార్డుదారులు 1050321 1 లీటరు రూ. 19 రూ. 19956099
     

Advertisement
Advertisement