టీడీపీ కార్యాలయాలుగా పోలీస్‌ స్టేషన్లు | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యాలయాలుగా పోలీస్‌ స్టేషన్లు

Published Tue, Jan 24 2017 10:41 PM

kethireddy blames police

- కానిస్టేబుళ్లపై దాడి హేయమైన చర్య
– ధర్మవరంలో నానాటికీ దిగజారుతున్న శాంతి భద్రతలు
– బాధిత పోలీసులకు న్యాయం చేసి నిందితులను శిక్షించాలి
– మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి డిమాండ్‌


ధర్మవరం టౌన్ : టీడీపీ అధికారంలోకొచ్చిన తర్వాత పోలీస్‌ స్టేషన్లు అధికారపార్టీ కార్యాలయాలుగా మారాయని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శించారు. శాంతిభద్రతలను పరిరక్షించే పోలీసులపై అధికార పార్టీ నాయకుల దాడులు అధికమయ్యాయని, పోలీసులకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.  మంగళవారం పట్టణంలోని స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  కేతిరెడ్డి మాట్లాడారు. నియోజకవర్గంలో శాంతిభద్రతలు నానాటికీ దిగజారుతున్నాయన్నారు.

అధికార పార్టీ నాయకులు ఏకంగా పోలీసులపైకి దాడులకు దిగుతున్నా ఉన్నతాధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. నిందితులకు వత్తాసుపలికేలా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. ఇటీవల ముదిగుబ్బ మండలంలోని రాళ్ల అనంతపురంలో అందరూ చూస్తుండగానే హరిలాల్‌నాయక్‌ అనే కానిస్టేబుల్‌పై ఇద్దరు టీడీపీ నాయకులు దాడి చేశారన్నారు. ఇది మరువకనే ఆదివారం ధర్మవరం పట్టణంలో పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగానే రవి అనే కానిస్టేబుల్‌పై టీడీపీ నాయకుడు భౌతిక దాడికి దిగడాన్ని బట్టి చూస్తే అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు ఎంత మేరకు ఉన్నాయో అర్థమవుతుందన్నారు.

కానిస్టేబుల్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా ముదిగుబ్బలో ఓ పోలీస్‌ అధికారి పంచాయితీ చేసి, రాజీ కుదుర్చేందుకు యత్నించారన్నారు. ధర్మవరంలో కానిస్టేబుల్‌పై దాడి చేసిన నిందితుడిపై చర్యలు తీసుకోకుండా పోలీస్‌ ఉన్నతాధికారి మిన్నకుండిపోవడాన్ని చూస్తుంటే పోలీసు వ్యవస్థపైన ప్రజలకు నమ్మకం కోల్పోయినట్లయ్యిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్‌ స్టేషన్లను పంచాయితీలు, సెటిల్‌మెంట్లు చేసుకునేందుకు వేదికలుగా మార్చారన్నారు.

బాధితులు అన్యాయానికి గురై పోలీస్‌ స్టేషన్‌కు వెళితే కౌంటర్‌ కేసులు కడుతూ రాజీ కావాలని నిందితులతో పంచాయితీలు కుదుర్చడం పరిపాటిగా మారిందన్నారు. కేవలం అధికారపార్టీల నేతల ప్రచార ఫ్లెక్సీలకు కాపలా కాయడం, పదుల సంఖ్యలో పోలీసులు కాపలా ఉండటం సిగ్గుచేటన్నారు. ఫ్లెక్సీల వివాదం కోసం 144 సెక‌్షన్‌ అమలు చేసే నీచ స్థితికి పోలీస్‌ వ్యవస్థ దిగజారడం దారుణమన్నారు. పోలీస్‌ వ్యవస్థ అంటే తమకు ఎంతో నమ్మకం ఉందని తక్షణం ప్రభుత్వం, పోలీస్‌ ఉన్నతాధికారులు కానిస్టేబుళ్లపై దాడులు చేసిన నిందితులను కఠినంగా శి„క్షించాలని కేతిరెడ్డి డిమాండ్‌ చేశారు. ìబాధిత పోలీసుల పక్షాన వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement