రేపు శ్రీవారికి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం | Sakshi
Sakshi News home page

రేపు శ్రీవారికి కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Published Mon, Sep 26 2016 6:42 PM

Koil Alwar Thirumanjanam on Tuesday

తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని నేటి మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ వైదిక కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు భక్తులకు శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం నిలిపివేస్తారు. ఆలయ మహాద్వారం నుంచి గర్భాలయం వరకు వైదికంగా భక్తిశ్రద్దలతో శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇందులో భాగంగా ఆ రోజు ఉదయం నిర్వహించాల్సిన అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దు చేశారు.

Advertisement
Advertisement