కృష్ణవేణి.. తెలుగింటి విరిబోణి | Sakshi
Sakshi News home page

కృష్ణవేణి.. తెలుగింటి విరిబోణి

Published Wed, Aug 3 2016 12:08 AM

కృష్ణవేణి.. తెలుగింటి విరిబోణి

కృష్ణా పుష్కరాల సందర్భంగా ఘాట్ల వద్ద ప్రధాన ఆకర్షణగా నిలిచేలా అధికార యంత్రాంగం కృష్ణవేణి విగ్రహాలను ఏర్పాటు చేయిస్తోంది. గత పుష్కరాల సమయంలో పలు ఘాట్లలో కృష్ణవేణి విగ్రహాలను ప్రతిషి్ఠంచారు. పన్నెండేళ్ల క్రితం జరిగిన పుష్కరాల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేతులు మీదుగా  బీచుపల్లి, జూరాల ప్రాంతాల్లో కృష్ణవేణి విగ్రహాలను ప్రతిష్ఠించారు. గద్వాలలో స్థానిక ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని పుష్కరాలు సమయంలో పట్టణ ప్రధాన కూడలిలో విగ్రహాలను ఏర్పాటు చేయించారు.  
 
పుష్కరాలకు గుర్తుగా కృష్ణవేణి విగ్రహాలు
గద్వాల: ‘కృష్ణానది సహ్య పర్వతాలపై పుట్టింది. శ్రీకృష్ణ పరమాత్మ సహ్యాద్రిపైన వేదగిరి వద్ద అశ్వత్థరూపంలో నిలిచినపుడు ఆ వేళ్ల నుంచి ఈ నది పుట్టిందని పురాణం చెబుతోంది. కలియుగంలో మునులంతా పాపాన్ని నశింపజేసుకోవడానికి ఈశ్వరుడిని ప్రార్థంచారు. అప్పుడు శివయ్య లింగంరూపంలో సహ్యాద్రిపై అవతరించారని, అక్కడున్న ఉసిరిచెట్టు నుంచి వేణినది పుట్టి, కృష్ణానదిలో కలవడంతో కృష్ణవేణి అయింది.’ పన్నెండేళ్లకోసారి వచ్చే కృష్ణా పుష్కరాల పురస్కరించుకుని వాటి జ్ఞాపకార్థం గద్వాలలో చెరగని ముద్ర వేశారు. పుష్కరాల గుర్తుగా రెండు విడుతలగా కృష్ణవేణి విగ్రహాలను ఏర్పాటు చేశారు. మొదటిసారి 1992లో గద్వాల పట్టణం నుంచి కృష్ణానదికి వెళ్లే మార్గంలో అప్పటి న్యాయశాఖ మంత్రి డీకే సమరసింహారెడ్డి కృష్ణవేణి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆ విగ్రహం అలాగే ఉంది. విగ్రహం ఏర్పాట్లుతో అది కృష్ణవేణి చౌరస్తాగా మారిపోయింది. పట్టణంలో అత్యంత రద్దీ ఉండేది ఇదొక్కటే.   2016 కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే డీకే అరుణ కృష్ణవేణి విగ్రహా ఏర్పాటుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. పాత కృష్ణవేణి విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మొదట సంకల్పించారు. అయితే రాజకీయ కారణాలు, సెంటిమెంట్లు అడ్డురావడంతో విగ్రహ ఏర్పాటులో కొంత జాప్యం జరిగింది. తదనంతరం పట్టణంలోని కృష్ణవేణి చౌరస్తా నుంచి కృష్ణానదికి స్వాగతం పలికే విధంగా తొమ్మిది అడుగుల కృష్ణవేణి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని డీకే అరుణ సొంత ఖర్చులతో చేయించారు. మే 4వ తేదీన కృష్ణవేణి విగ్రహాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రజలను ఆకట్టుకునే సహజత్వంతో కృష్ణవేణి విగ్రహం ఉట్టిపడుతోంది. ప్రస్తుతం కృష్ణ పుష్కరాలకు గుర్తుగా శోభాయమానంగా మారింది. 
 
తల లేని కృష్ణమ్మ.. 
ఆత్మకూర్‌: పన్నెండేళ్ల క్రితం జరిగిన కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నందిమల్ల పుష్కరఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన కృష్ణవేణి అమ్మవారి విగ్రహాన్ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ప్రతిషి్ఠంచి, ప్రారంభించారు. ఆ తర్వాత ఆలనాపాలన లేకపోవడంతో కృష్ణవేణి విగ్రహం ధ్వంసమైంది. ప్రస్తుతం విగ్రహానికి తల లేదు. అక్కడ నిర్మించిన  ఆలయం కూలిపోయి విగ్రహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఇక్కడ ఉన్న గుడిని పునరుద్ధరించాలని స్థానిక భక్తులు కోరుతున్నారు. 
 
కొత్తఘాట్‌లో కొత్త విగ్రహం.. 
ఇటిక్యాల: కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని 2004లో బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణవేణి విగ్రహాన్ని ప్రతిషి్ఠం చారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అధికారుల ఆదేశాల మేరకు ఈ ఏడాది నూతనంగా నిర్మిస్తున్న పుష్కరఘాట్‌పై సైతం కృష్ణవేణì  విగ్రహాన్ని ప్రతిషి్ఠంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.గురువు కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతాయి. అప్పటి నుంచి ముక్కోటి దేవతామూర్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. 

Advertisement
Advertisement