మేనమామ స్ఫూర్తితో నటనవైపు అడుగులు
ఉన్నత చదువు చదివినా యాక్షన్‌పైనే ఆసక్తి
వెండితెర, బుల్లితెరలపై రాణిస్తున్న శ్రీకాకుళం జిల్లా యువకుడు
నటుడిగా రాణించి, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలన్నది ఆ యువకుడి జీవితాశయం. నటన పట్ల అంతులేని ఆసక్తితో ఉన్నత చదువు చదివినా నటననే వృత్తిగాను, ప్రవృత్తిగాను ఎంచుకున్నాడు. ఉద్యోగం, ఉపాధి వంటి అవకాశాలు వచ్చినా ఇష్టపడ్డ రంగాన్ని ఎంచుకుంటే జీవితంలో రాణించవచ్చన్నది అతని భావన. అందుకే వెండితెర, బుల్లితెరలపై తన ట్యాలెంట్ నిరూపించుకుని ఓ వెలుగు వెలగాలనే ధ్యేయంతో ఉన్నాడు కూన వేణుగోపాల్ అనే ఈ యువ నటుడు.
శ్రీకాకుళం: సినీ, టీవీ రంగాల్లో రాణిస్తూ ముందుకు సాగుతున్న కూన వేణుగోపాల్ స్వగ్రామం పోలాకి మండలం నర్సాపురం. విద్యాభ్యాసం అంతా ఎచ్చెర్ల మండలం సనపలవానిపేటలోనే సాగింది. నాటక రంగ దిగ్గజం మెట్ట అప్పారావు నాయుడు ఇతని మేనమామ. మేనమామ ఇంటి దగ్గర ఉంటూ చదువుకుంటూ, ఆయన స్ఫూర్తితోనే నటన రంగంలోకి అడుగు పెట్టాడు. బి.ఫార్మశీ చదివిన ఈ యువకుడు సిక్కింలోని మణిపాల్ యూనివర్శిటీలో పీజీ మాస్ కమ్యూనికేషన్స్ చేశారు.
ఎఫ్ఎం రేడియోలో ప్రవేశం
నటనపై ఆసక్తితో ముందుగా హైదరాబాద్‌లో 2009లో ఎఫ్ఎం రేడియో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించాడు. అక్కడి నుంచి దొరికిన ప్రతి అవకాశం సద్వినియోగం చేసుకునే పనిలో పడాడు. ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున,సమంత, తమన్నా వంటి వారి ఇంటర్వ్యూలను మాటీవీ కోసం చేశారు. మాటీవీ యాంకర్‌గా సైతం కొంతకాలం పని చేశారు. సమ్‌థింగ్ స్పెషల్ కార్యక్రమం యాంకర్‌గా అతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.
ప్రకాశ్‌రాజ్, నానాపటేకర్ స్ఫూర్తితో..
జాతీయస్థాయి ఉత్తమనటులు ప్రకాశ్‌రాజ్,నానాపటేకర్‌లను స్ఫూర్తి తీసుకొని ముందుకు సాగుతున్న వేణు ప్రస్తుతం టీవీ, సినీ రంగంలో అవకాశాలు రావటం అంత తేలిక కాదు అని, అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగటం మంచిదని భావిస్తున్నారు. బుల్లితెర సీరియల్స్‌లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. బంగారుకోడిపెట్ట, వెయ్యి అబ ద్ధాలు, జైశ్రీరాం,సరదాగాఅమ్మాయిలతో.. వంటి సినిమాల్లో నటించాడు.
అలామొదలైంది.. సీరియల్‌తో ప్రేక్షకులకు చేరువయ్యాడు. మరో పక్క జీటీవీలో ప్రసారం అయిన గంగతో రాంబాబు సీరియల్లో తాను నటించిన హాస్య న్యాయవాది పాత్రకు మంచి గర్తింపు తెచ్చుకున్నారు.అన్వేషిత సీరియల్లో నటన అతని నటన ఆకట్టుకుటుంది.సన్ నెట్వర్క్,రాడాన్ వంటి సంస్థ వంటివి తమిళ సీరియల్స్‌లో నటించేందుకు ఆఫర్లు కల్పిస్తున్నాయి. వ్యవసాయ వృత్తిని నమ్ముకున్న తండ్రి కృష్ణారావు, గృహిణి తల్లి విజయలక్ష్మి కూడా కుమారుడు ఆసక్తిని, అభిరుచిని ప్రోత్సహిస్తున్నారు.
ప్రకాశ్‌రాజ్, నానాపటేకర్ స్ఫూర్తితో...
Published Tue, Sep 1 2015 12:30 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్‌రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement