హోరా హోరీగా కుస్తీ పోటీలు | Sakshi
Sakshi News home page

హోరా హోరీగా కుస్తీ పోటీలు

Published Sun, Oct 23 2016 11:41 PM

హోరా హోరీగా కుస్తీ పోటీలు

– జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన అనంత క్రీడాకారిణి
కళ్యాణదుర్గం రూరల్ః రాష్ట్రస్థాయి అండర్‌–19 కుస్తీ పోటీలు హోరా హోరీగా జరుగుతున్నాయి. స్థానిక కరణం చిక్కప్ప ఉన్నత పాఠశాల ఆవరణంలో ఉన్న ఇండోర్‌స్టేడియంలో ఆదివారం పీఈటీల జిల్లా సెక్రటరీ లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. ఈ పోటీలకు 13 జిల్లాల క్రీడాకారులు హాజరయ్యారు. 44 కేజీల విభాగంలో అనంతపురం జిల్లా క్రీడాకారిణి ప్రియాంక మొదటి స్థానంలో నిలవగా కర్నూలు జిల్లాకు చెందిన వాణెమ్మ ద్వితీయస్థానంలో నిలిచింది. మొదటి స్థానం సాధించిన ప్రియంక జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. 48కేజీల విభాగంలో ఈస్ట్‌ గోదావరి జిల్లాకు చెందిన జి.అనూష  మొదటిస్థానం, బి.గంగావతి(అనంతపురం) ద్వితీయ స్థానం గెలుపొంది బంగారు పతకాలు దక్కించుకున్నారు.

51 కేజీల విభాగంలో నెల్లూరు చెందిన కె.బిందుప్రియ ,అనంతపురానికి చెందిన కె.శిరీషలు మొదటి రెండు స్థానంలో నిలిచారు.  55కేజీల విభాగంలో గుంటూరుకు చెందిన పి.శిరిష మొదటి స్థానం, విజయనగరానికి చెందిన ఎల్‌.పాపయమ్మ ద్వితీయ స్థానం దక్కించుకున్నారు. 59కేజీల విభాగంలోగుంటూరుకు చెందిన ఎన్‌. రూతురాణి మొదటి స్థానం, నెల్లూరుకు చెందిన ఎన్‌ భారతి ద్వితీయ స్థానంలో బంగారు పతాకం కైవసం చేసుకున్నారు. 63 కేజీల విభాగంలో గుంటూరుకు చెందిన జి.శ్రావణి మొదటి స్థానం, ఈస్ట్‌ గోదావరికి చెందిన పి.క్రాంతిరేఖ ద్వితీయ స్థానం సాధించి బంగారు పతకం సాధించారు. 67కేజీల విభాగంలో చిత్తూరు జిల్లాకు చెందిన పి.జయ మొదటి స్థానం, అనంతపురానికి చెందిన ఎస్‌.సుమియాబాను ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 72కేజీల విభాగంలో నెల్లూరుకు చెందిన ఎన్‌.నిహారిక మొదటి స్థానం, ఈస్ట్‌ గోదావరికి చెందిన వై,అనూష ద్వితీయ స్థానంలో గెలుపొందారు. మొత్తంగా అనంతపురం జిల్లా బాలికలు రెండు బంగారు పతకాలు, మూడు సిల్వర్‌ పతకాలు, మూడు కాంస్య పతకాలు సాధించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement