ఆగని కూలీల వలసలు | Sakshi
Sakshi News home page

ఆగని కూలీల వలసలు

Published Sun, Apr 9 2017 11:08 PM

ఆగని కూలీల వలసలు - Sakshi

శింగనమల : ఉపాధి కోసం కూలీలు వలస వెళుతున్నారు. ఉపాధి హామీ కింద పనులు పూర్తిస్థాయిలో లభించకపోవడం, ఒక వేళ దొరికినా కూలి చెల్లింపుల్లో నెలల తరబడి జాప్యం జరుగుతుండటంతో కూలీలు పస్తులుండలేక పనుల కోసం వలస బాట పట్టకతప్పడం లేదు.

సోదనపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఇదివరకే 30 మంది గుంటూరు జిల్లాకు రెండు బ్యాచ్‌లుగా మిరపకాయలు తొలగించే పనుల కోసం వెళ్లారు. తాజాగా ఆదివారం గుర్రప్ప, పెద్దన్న, గిర్రప్ప, ఎర్రినాగప్ప సహా 20 మంది గుంటూరుకు పయనమయ్యారు. అక్కడ మిరపకాయలు తొలగిస్తే రోజుకు రూ.200 కూలి వస్తుందని కూలీలు తెలిపారు. ఉపాధి పనులు తగినన్ని కల్పించి, కూలి సకాలంలో చెల్లించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement