కోల్‌బెల్ట్‌లో ల్యాండ్‌ మాఫియా | Sakshi
Sakshi News home page

కోల్‌బెల్ట్‌లో ల్యాండ్‌ మాఫియా

Published Tue, Sep 27 2016 12:02 AM

కోల్‌బెల్ట్‌లో ల్యాండ్‌ మాఫియా

  • అండగా అధికారపార్టీ ప్రజాప్రతినిధులు 
  • రెండు గ్యాంగ్‌లను గుర్తించిన పోలీసులు
  • చర్యలకు వెనుకంజ 
  •  
    రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ల్యాండ్‌ మాఫియా రెచ్చిపోతోంది. నకిలీ పత్రాలతో భూములు కజ్జా చేస్తోంది. ఒకే స్థలాన్ని ఇద్దరు, ముగ్గురికీ రిజిస్ట్రేషన్‌ చేయిస్తూ లక్షలు ఆర్జిస్తోంది. అడ్డువచ్చేవారిని అంతం చేసేందుకు కూడా వెనుకాడడంలేదు. అధికార పార్టీకి చెందిన కొందరు ఈ మాఫియాకు కొమ్ముకాస్తున్నారు. దీంతో ఇప్పటికే ఈ మాఫియాను గుర్తించిన పోలీసులు చర్యలకు వెనుకంజ వేస్తున్నారు. 
    – గోదావరిఖని
     
    గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న సుమారు 40వేల ఎకరాల భూమిలో 75 శాతంపైగా సింగరేణి, ఎఫ్‌సీఐ, ఎన్టీపీసీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఆధీనంలో ఉంది. మార్కండేయకాలనీ, ఎన్టీపీసీ, గౌతమీనగర్‌ తదితర ప్రాంతాల్లో ప్రైవేటు భూమి ఉంది. ఈ ప్రాంతాల్లో నివాసాలు ఏర్పడగా ఇంకా ఖాళీ స్థలాలు ఉన్నాయి. గతంలో పలు చోట్ల కొందరు  ప్రైవేటు వ్యక్తులు భూమిని కొనుగోలు చేసి వెంచర్లు వేశారు. ఒకే ప్లాట్‌ను ఇద్దరు, ముగ్గురి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారు. మార్కండేయకాలనీలో దాదాపు చాలావరకు ప్లాట్లు ఇలాగే ఉన్నాయి. భాగస్వాముల మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. 
    పోటాపోటీగా దందా.. 
    పట్టణంలోని ఓ ప్రయివేటు పాఠశాలను మూసివేయగా అక్కడ ఉన్న 12 గుంటల భూమిని ఆరుగురికి విడిపోయిన రియల్‌ వ్యాపారుల్లో ఒకరు రూ.1.50 కోట్లకు విక్రయించాడు. తీరా ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఆరుగురు Ðð ళ్లగా... ఆ స్థలం తమకు ఎప్పుడో విక్రయించారని మరో వ్యాపారికి చెందినవారు అడ్డుకున్నారు. ఈ వ్యవహారం ఇంకా తేలలేదు. 
    2002, 2003 సంవత్సరాల్లో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సమీపంలో 16 మంది పేదలు 36 గుంటల స్థలాన్ని ఓ వ్యక్తి వద్ద కొనుగోలు చేశారు. అయితే 25 ఏళ్ల క్రితమే మరణించిన ఓ వ్యక్తికి వారసులెవరూ లేకపోయినా...వరంగల్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన అదే పేరుగల వ్యక్తిని తీసుకువచ్చిన కొందరు పెద్దమనుషులు ఆ స్థలాన్ని కొట్టెయ్యడానికి యత్నించారు. ఇందుకోసం 2008లో అప్పటి రెవెన్యూ అధికారుల సహకారంతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. ఈ సర్టిఫికెట్‌ ఆధారంగా చేసుకుని ప్రత్యర్థులుగా మారిన రియల్‌ వ్యాపారులు సదరు వ్యక్తితో ఏడుగురు బినామీల పేరుపై రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అయితే ఈ విషయమై వరంగల్‌కు చెందిన అదే పేరుగల వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తే గోదావరిఖనిలో ఉన్న వ్యక్తికి తనకు సంబంధం లేదని చెప్పినట్లు సమాచారం. దీంతో పోలీసులు చట్టపరంగా చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
     
    కొత్తగా మరో రెండు గ్యాంగ్‌లు.. 
    పట్టణంలో పది మంది రెండు గ్యాంగ్‌లుగా ఏర్పడి ఖాళీ స్థలాలు, భవనాలపై కన్నేశారు. రెవెన్యూ అధికారుల సహకారంతో నకిలీ యాజమాన్యపత్రాలు తయారు చేయించి వాటిని కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లు సృష్టించి ఇతరులకు విక్రయిస్తున్నారు. తర్వాత యజమానికి కొనుగోలుదారుల మధ్య ఏర్పడిన పంచాయితీ పరిష్కరించేందుకు పెద్దమనుషుల అవతారం ఎత్తుతున్నారు. ఇరువర్గాల నుంచి డబ్బులు తీసుకుంటూ సెటిల్‌మెట్లు చేస్తున్నారు. ఈ గ్యాంగ్‌లను కూడా పోలీసులు గుర్తించారు. 
     
    ౖయెటింక్లయిన్‌కాలనీలో.. 
    ౖయెటింక్లయిన్‌కాలనీలోనూ భూదందా కొనసాగుతోంది. డెప్యూటీ మేయర్‌ సాగంటి శంకర్, మాజీ ప్రజాప్రతినిధి, సింగరేణి ఉద్యోగి జి.మల్లికార్జున్‌కు మాజీ ప్రజాప్రతినిధి భర్త, రౌడీషీటర్‌ తాళ్ల రాజయ్య మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆరునెలల క్రితం తాళ్ల రాజయ్య, అతడి అనుచరులు మల్లికార్జున్‌పై దాడి చేశారు. అయితే ఇటీవల వివాదాస్పద స్థలాన్ని కార్పొరేషన్‌కు అప్పగించేలా డెప్యూటీ మేయర్‌ చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో తాళ్ల రాజయ్య అతడి అనుచరులు శంకర్‌ను హతమార్చేందుకు రెక్కీ నిర్వహించినట్లు తెలిసింది. దీంతో ఆయన తనకు ప్రాణభయం ఉందని పోలీసులను ఆశ్రయించాడు. ఈ వివాదంలో కొందరికి అధికారపార్టీకి చెందిన ఓ ముఖ్య నేత సహకారం అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే మల్లికార్జున్‌పై సోమవారం మళ్లీ దాడి జరిగినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తాళ్ల రాజయ్య వర్గీయులపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
     
    సెటిల్‌మెంట్‌ విషయంలోనే వీరస్వామి హత్య
    భూవివాదం సెటిల్‌మెంట్‌ విషయంలోనే ఈ నెల 11న కాంగ్రెస్‌ నాయకుడు దార వీరస్వామి దారుణ హత్యకు గురయ్యాడు. ఓ గ్యాంగ్‌ పథకం ప్రకారమే వీరస్వామిని హతమార్చినట్లు తెలుస్తోంది. అనుమానితులపై రామస్వామి భార్య ఫిర్యాదు చేసినా నిందితులను పోలీసులు ఇంతవరకూ పట్టుకోలేదు. ఈ హత్య వెనుక బడా రాజకీయ నాయకులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నిందితుడిని పట్టుకుంటే జనగామ శివారు భూమిలో భూదందా వెలుగుచూసే అవకాశం ఉంది.   
     
    ===================
     
    మాజీ కౌన్సిలర్‌పై దాడి?
    ౖయెటింక్లయిన్‌కాలనీ: మాజీ కౌన్సిలర్‌ గూళ్ల మల్లికార్జున్‌పై సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసి గాయపర్చారు. ఆర్జీ–1 సీహెచ్‌పీలో డ్యూటీ ముగించుకుని ద్విచక్రవాహన ంపై ౖయెటింక్లయిన్‌కాలనీలోని తన ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అటకాయించి దాడి చేసినట్లు సమాచారం. బైక్‌ వస్తుండగా కోల్‌కారిడార్‌ రోడ్డు వెంట సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు సమీపంలో కొందరు వెంబడించితలపై కొట్టడంతో కిందపడిపోయాడని, ఆతర్వాత తీవ్రంగా కొట్టారు. స్పృహ తప్పడంతో వెళ్లిపోయినట్లు తెలిసింది. తలకు హెల్మెట్‌ ఉండటంతో ప్రాణాపాయం తప్పిందని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. రోడ్డుపై అపస్మారక స్థితిలో ఉన్న మల్లికార్జున్‌ను పోలీసులు గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్‌లోని ప్రయివేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తాళ్ల రాజయ్య అనుచరులే దాడి చేసి హత్యాయత్నం చేశారని కుటుంబ సభ్యులు గోదావరిఖని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 
     
     

Advertisement
Advertisement