నిమజ్జనం చేద్దాం ఇలా.. | Sakshi
Sakshi News home page

నిమజ్జనం చేద్దాం ఇలా..

Published Tue, Sep 13 2016 5:20 PM

సదాశివపేట సాయిరాంనగర్‌ కాలనీలో వినాయక విగ్రహం - Sakshi

  • జాగ్రత్తలు పాటిస్తే మేలు
  • రేపు సామూహిక వినాయక నిమజ్జనోత్సవం
  • సదాశివపేట: మండపాల్లో పదకొండు రోజుల పాటు భక్తుల పూజలందుకున్న ఏకదంతుడికి గురువారంతో ఘనంగా వీడ్కోలు చెప్పనున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు  సదాశివపేట ప్రాంతంలో  ఘనంగా జరుగుతున్నాయి. మండపాల వద్ద భక్తిశ్రద్ధలతో  భక్తులు బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసి పరవశిస్తున్నారు.

    వినాయక మండపాల వద్ద  నిత్యం భక్తులు ఆధ్యాత్మిక  చింతనతో గడుపుతున్నారు. నవరాత్రోత్సవాల సందర్భంగా పట్టణ పరిధిలోని మండపాల వద్ద సందడి సందడి నెలకొంటోంది. ఇక నిమజ్జన వేళ భక్తుల కొలహలం మిన్నంటనుంది. విఘ్నాలు తొలగించే వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే విజయవంతంగా నిర్వహించుకోవచ్చు.

    పట్టణంలోని వివిద ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 85 సామూహిక వినాయక విగ్రహాలను  గురువారం  మహేశ్వరి థియేటర్‌ సమీపంలోని మాడిచేట్టి రాచయ్య భావిలో విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఈ సందర్బంగా తీసుకోవలసిన జాగ్రత్తలను అందరు పాటిస్తే ఎలాంటి అపశృతులు దోర్లకుండ ప్రశాంతంగా శాంతియుతంగా నిమజ్జనోత్సవం ముగుస్తుంది.

    పిల్లల విషయంలో జాగ్రత్తలు
    పిల్లల విషయంలో కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలో ఉండాలి. పిల్లలకు  తల్లిదండ్రులు ముందుగా పూర్తి స్ధాయిలో సూచనలు సలహాలు ఇవ్వాలి.  నిమజ్జనోత్సవాలకు  ఒంటరిగా చిన్నారులను పంపించకూడదు.  తోడుగాగాని కుటుంబ సభ్యుల్లో  ఒకరు గానీ ఉంటే తప్ప పంపించకూడదు. సైడ్‌వాల్‌ లేని భవనాల చివరన నిల్చుని, కూర్చొని నిమజ్జన ఉత్సవాలను   చూడవద్దు.

    విద్యుత్‌ తీగల విషయంలో...
    నిమజ్జన సమయంలో చాల వరకు విద్యుత్‌ తీగలు విద్యుత్‌ వల్ల ప్రమాదాలు  చోటు చేసుకుంటాయి. వినాయక విగ్రహాలను  ఊరేగించే విధుల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ తీగలను  కిందకు వేలాడకుండా పైకి ఉండేలా విద్యుత్‌  అధికారులు చర్యలు తీసుకోవాలి. వినాయక విగ్రహాల ఊరేగింపు సమయంలో విద్యుద్ధీకరణ కోసం ఉపయోగించే  విద్యుత్‌ వైర్లు నాణ్యమైనవి ఉండాలి.

    సెట్టింగ్‌లపై జాగ్రత్తలు
    వినాయక విగ్రహాల ఊరేగింపు సమయంలో సెట్టింగ్‌ల పైభాగంలో  విద్యుత్‌ తీగలు తగల కుండ జాగ్రత్తలు చూసుకోవాలి. సెట్టింగ్‌లు  ఏర్పాటు చేసే సమయంలో వినాయకుని ప్రతీమ వద్దకు  వెళ్లేందుకు  ఏర్పాటు చెసే  మెట్లు, స్టేజీలను  పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవాలి. విద్యుద్ధీకరణ కోసం వాడే  విద్యుత్‌   వైర్లు నాణ్యమైనవే ఉపయోగించాలి. విద్యుత్‌ తీగలు  ఎక్కడ కూడ తెగిపోకుండా, జాయింట్లు  లేకుండా చూసుకోవాలి. టపాకాయల వంటి వాటిని సెట్టింగ్‌ల సమీపంలో కాల్చకుండా  చూసుకోవాలి. అగ్ని ప్రదాలకు అస్కారం ఉండే  వాటిని  దూరంగా ఉంచాలి.

    క్రమపద్దతిలో ఊరేగించాలి
    నిమజ్జన ఊరేగింపులో ఏలాంటి ఉద్వేగానికి లోనుకాకూడదు. సంవయమనం పాటించాలి. లాటరీ పద్దతిలో   కేటాయించిన నంబర్ల  ప్రకారమే వినాయకులను నిర్వహకులు క్రమపద్ధతిలో తరలించాలి. పోలీసులు,  గణేష్‌ ఉత్సవ సమితి వారు మండపాల  నిర్వహాకులు  సూచించిన విధి విధానాలు పాటించాలి. కేటాంచిన నంబర్ల వినాయక విగ్రహాలను నిర్ణిత సమయంలో గాంధీ చౌక్‌ వద్దకు నిర్వహాకులు తీసుకురావాలి.

    నిమజ్జన సమయంలో...
    వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే సమయంలో  జాగ్రత్తగా  వ్యవహారించాలి. వినాయక ప్రతిమలను మాడిచేట్టి రాచయ్య బావిలొ నిమజ్జనం చేయడానికి  మున్సిపల్‌   అధికార యంత్రాంగం  ప్రత్యేకమైన క్రేయిన్‌ తదితర ఏర్పాట్లు చేశారు. మండపాల నిర్వహాకులు  నిమజ్జన సమయంలో  చాల ఆప్రమత్తంగా ఉండాలి.

    నిమజ్జనోత్సవంలో నిర్వహాకులు  శాంతి, సామరస్యపూర్వకంగా ఉండాలి. ట్రాక్టర్‌పైన వినాయక విగ్రహాం వద్ద  ఎక్కువ మంది  ఉండకుండ చూసుకోవాలి. ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం విగ్రహాలను నిమజ్జన ప్రదేశానికి తీసుకువచ్చి నిమజ్జనం చేయాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement