ఏక కాలంలో రుణమాఫీ జరగాలి | Sakshi
Sakshi News home page

ఏక కాలంలో రుణమాఫీ జరగాలి

Published Mon, Nov 7 2016 3:23 AM

ఏక కాలంలో రుణమాఫీ జరగాలి - Sakshi

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్

 పాలకుర్తి: రాష్ట్రంలో రైతులకు ఏక కాలంలో రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీరుుంబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చే యూలని, లేని పక్షంలో పోరు తప్పదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆది వారం జనగామ జిల్లా పాలకుర్తిలో ఆయన విలేకరులతో మాట్లాడారు.రాష్ట్రంలో 37 లక్షల పాస్‌బుక్‌ల ద్వారా రైతులు తమ భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టారని, మరో మూడు లక్షల మంది బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్నారని చెప్పారు.

అధికారంలోకి రాకముందు.. ఒకేసారి రుణమాఫీ చేస్తామని చెప్పిన టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక విడతల వారీగా రుణమాఫీ చేస్తున్నదన్నారు. రూ.3,100 కోట్లు ఫీజు రీరుుం బర్స్‌మెంటు నిధులు విడుదల కాకపోవడంతో రాష్ర్టంలో 3,200 కళాశాలలు మూసి వేత  దిశగా ఉన్నాయన్నారు. రెండున్నర లక్షల మంది లెక్చరర్లు ఆరు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనుల కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లింపులు జరుగుతున్నామయని.. రైతులు, విద్యార్థులకు నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement