మహారాష్ట్రతో ఒప్పందం గొప్ప విషయం | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రతో ఒప్పందం గొప్ప విషయం

Published Wed, Aug 24 2016 5:36 PM

మహారాష్ట్రతో ఒప్పందం గొప్ప విషయం - Sakshi

యాదగిరిగుట్ట : తెలంగాణలోని మూడు ప్రాజెక్టులకు నీళ్లు తీసుకువచ్చి ఇక్కడి రైతాంగ సమస్యను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం గొప్ప విషయమని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత అన్నారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వస్తున్న సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలకడానికి యాదగిరిగుట్ట నుంచి బుధవారం టీఆర్‌ఎస్‌ నాయకులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా తరలివెళ్తున్న వాహనాలకు ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత జెండా ఊపి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో మన నీళ్లను, నిధులను దోచుకున్న నాయకులకు ఈ రోజు చెంపపెట్టులాంటిదన్నారు. ప్రతి పక్షాల్లో ఉన్న కాంగ్రెస్, టీడీపీ నాయకులు నీళ్లను అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన విఫలమయ్యాయన్నారు. గోదావరిపై మేడిగడ్డ బ్యారేజీ, ప్రాణహిత పై తుమ్మిడిహట్టి బ్యారేజీ, పెన్‌గంగపై చనాక– కొరాటా బ్యారేజీలు నిర్మించడంతో తెలంగాణ ప్రజల్లో సీఎం కేసీఆర్‌ అపర భగీరథుడిగా చరిత్రలో నిలిచి పోతారని తెలిపారు. ఎంపీపీ గడ్డమీది స్వప్న, జెడ్పీటీసీ కర్రె కమలమ్మ, సర్పంచ్‌లు కసావు శ్రీనివాస్‌గౌడ్, బూడిద స్వామి, టీఆర్‌ఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరె యాదగిరిగౌడ్, మండల, పట్టణాధ్యక్షులు కర్రె వెంకటయ్య, కాటబత్తిని ఆంజనేయులు, యువజన విభాగం కన్వీనర్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్, బరిగె బాలయ్య, పిట్టల సత్యనారాయణ, గొట్టం కృష్ణారెడ్డి, కనుకుల సిద్ధారెడ్డి, మారెడ్డి కొండల్‌రెడ్డి, పులెపాక అశోక్‌ తదితరులున్నారు.
 

Advertisement
Advertisement