పకడ్బందీగా మహాశివరాత్రి ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా మహాశివరాత్రి ఏర్పాట్లు

Published Wed, Jan 4 2017 11:54 PM

పకడ్బందీగా మహాశివరాత్రి ఏర్పాట్లు - Sakshi

·అధికారులతో ఈఓ సమీక్ష 
గత బ్రహ్మోత్సవాల అనుభవాలు,లోటుపాట్లపై చర్చ
 రోజూ 15 లక్షల గ్యాలెన్ల నీటి సరఫరా
పాతాళగంగ, లింగాలగట్టు వద్ద బ్యారికేడ్లు 
 ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం
 శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలమహాక్షేత్రంలో ఫిబ్రవరి 15 నుంచి 27 వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టనున్నట్లు ఈఓ నారాయణభరత్‌ గుప్త తెలిపారు. బుధవారం సాయంత్రం పరిపాలనా భవనంలో జేఈఓ హరినాథ్‌రెడ్డి, ఏసీ మహేశ్వరరెడ్డి, అధికారులు, ఉభయ ఆలయాల ప్రధానార్చకులు,  వేదపండితుతో ఈఓ సమీక్ష నిర్వహించారు. గత బ్రహ్మోత్సవాల అనుభవాలు, లోటుపాట్లను దృష్టిలో ఉంచుకుని వాటికనుగుణంగా ఏర్పాట్లను చేస్తున్నట్లు ఈఓ తెలిపారు. ఇందులో భాగంగా భక్తులకు రోజూ 15 లక్షల గ్యాలన్ల నీటిని సరఫరా చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అలాగే క్షేత్రమంతటా 500లకు పైగా మంచినీటి కుళాయిలను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.· లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఆయా ప్రదేశాలు, విశాలమైన ప్రాంగణాలను ఏర్పాటు చేసి షామియానాలు, చలువపందిళ్లను ఏర్పాటు చేయవల్సిందిగా ఇంజనీరింగ్‌ విభాగాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శివదీక్షా శిబిరాలు, శివసదనం, శివాజీగోపురం ఎదురుగా ఉన్న ఉద్యానవనాలు, హరిహరరాయగోపురం ఎదురుగా ఉన్న గార్డెన్, తదితర ప్రదేశాలలో తాత్కాలికంగా వసతులను ఏర్పాటు చేయాలని సూచించారు. 
 
  •  వివిధ ప్రదేశాలలో మరుగుదొడ్లు, స్నానపు గదుల ఏర్పాటు
  • -అత్యవసర వైద్యసేవల కోసం ప్రత్యేక చర్యలు
  •   వాహనాల పార్కింగ్‌కు యజ్ఞవాటిక, హెలిప్యాడ్, తదితర ప్రదేశాల వద్ద చదును చేసి అవసరమైన ఏర్పాట్లు
  •  ఏపీఎస్‌ఆర్టీసీ, కర్ణాటక, ప్రైవేటు వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్‌ స్థలాలు
  • అవసరమైనచోట్ల వన్‌వే ట్రాఫిక్‌ నిర్వహణకు చర్యలు
  • క్షేత్ర వ్యాప్తంగా విద్యుత్‌ దీపాల ఏర్పాటు
  •  స్వామివార్ల దర్శనం కోసం ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర, ప్రత్యేక శివదీక్షా భక్తులకు వేర్వేరు క్యూల ఏర్పాటు
  •  గతంలో ఉన్న క్యూల పరిధిని దాదాపు 30 శాతం పెంపు 
  • పాదయాత్ర భక్తులకు నాగలూటి, కైలాసద్వారం వద్ద ఏర్పాట్లు
  • భక్తులు పుణ్యస్నానాలాచరించేందుకు వీలుగా పాతాళగంగ, లింగాలగట్టు వద్ద బ్యారికేడింగ్‌, గజ ఈతగాళ్లను నియామకం
·- పాల పదార్థాలు, డీజీల్, పెట్రోల్‌ నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా చర్యలు
· -ఉత్సవాలలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పుష్పాలంకరణ
·- పలు ధార్మిక,సాంస్కృతిక కార్యక్రమాలను శివదీక్షస్వాములు, భక్తులను అలరించడానికి శివదీక్షాశిబిరాలలో, దేవస్థానం పుష్కరణి వద్ద, గ్రామోత్సవంలో జానపద కళారూపాల ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఈఓ పేర్కొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement