ట్రాక్టర్‌ బోల్తా: యువకుడి దుర్మరణం

7 Mar, 2017 23:45 IST|Sakshi
ట్రాక్టర్‌ బోల్తా: యువకుడి దుర్మరణం

చిలమత్తూరు : కర్ణాటకలోని బాగేపల్లి సమీపంలోగల దేవర గుడ్డపల్లి(గడిదం) చెరువులో ట్రాక్టర్‌ బోల్తా పడి అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కందూరుపర్తికి చెందిన డ్రైవర్‌ గంగాధర్‌(27) మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కందూరుపర్తికి చెందిన నిడిమామిడమ్మ, ఆదినారాయణప్ప కుమారుడు గంగాధర్‌ జేసీబీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

పని నిమిత్తం బాగేపల్లి సమీపంలోని గడిదం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ట్రాక్టర్‌ను డ్రైవ్‌ చేసుకుంటూ చెరువులో వస్తుండగా అదుపు తప్పి గుంతలో బోల్తా పడటంతో మరణించినట్లు వివరించారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. బాగేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు