వసూళ్లకు పాల్పడుతోన్న మావోయిస్టు అరెస్టు | Sakshi
Sakshi News home page

వసూళ్లకు పాల్పడుతోన్న మావోయిస్టు అరెస్టు

Published Sun, Nov 6 2016 2:37 PM

maoist arrested in illegal money collection case

పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలో వ్యాపారస్థుల వద్ద వసూళ్లకు పాల్పడుతోన్న ఓ మావోయిస్టును పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ మావోయిస్టు పినపాక ఏరియా దళ కమాండర్ భూక్య వెంకన్న అలియాస్ వేణుగా పోలీసులు గుర్తించారు. మణుగూరు డీఎస్పీ అశోక్‌కుమార్ బయ్యారం పోలీస్‌స్టేషన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఏడూళ్ల బయ్యారం వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో వేణు పట్టుబడినట్లు ఆయన తెలిపారు. వేణు స్వస్థలం గుండాల మండలం అని, కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు చెప్పారు.

Advertisement
Advertisement