Sakshi News home page

‘వాణిజ్య’ జీవ వనరుల పట్టిక సిద్ధం

Published Fri, Dec 16 2016 12:50 AM

Mexico Biodiversity Convention

సాక్షి, హైదరాబాద్‌: వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న జీవ వనరుల పట్టిక తయారు చేసినట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. వ్యవసాయదారులు తరతరాలుగా కాపాడుకుంటున్న వంగడాలను వారి పేరిట రిజిష్టర్‌ చేస్తున్నామని చెప్పారు. గురువారం మెక్సికోలోని కాన్‌కున్‌ నగరంలో బయోడైవర్సిటీ అంతర్జాతీయ సదస్సు (కాప్‌–13) ముగింపు సమావేశంలో మంత్రి ప్రధాన ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీవ వైవిద్య సంరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, గ్రామ స్థాయిలో జీవ వైవిధ్య కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో జీవ వైవిధ్య ప్రాముఖ్యం గల ప్రాంతాల్లో 70 ప్రజా జీవ వైవిధ్య రిజిష్టర్లను తయారు చేసినట్లు వెల్లడించారు. జీవ వనరులను వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్న 15 పరిశ్రమలతో పంపకంపై ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుందన్నారు. ఆదిలాబాద్‌లో 2020 లోగా వారసత్వ పశు జాతుల క్షేత్రం ఏర్పాటుకు కాప్‌–11లో తీర్మానం చేయడాన్ని, ప్రస్తుత సదస్సు సందర్భంగా తెలంగాణకు రూ.300 కోట్లు కేంద్రం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణకు యూఎన్‌ డెవలప్‌మెంట్‌ బయోడైవర్సిటీ, 2016 అవార్డు దక్కిందని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ బయోడైవర్సిటీ బోర్డు సహాయ కార్యదర్శి అమిత ప్రసాద్, తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు సభ్య కార్యదర్శి సి.సువర్ణ పాల్గొన్నారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement