కలిగాంలో మినీ రక్షిత మంచినీటి పథకం | Sakshi
Sakshi News home page

కలిగాంలో మినీ రక్షిత మంచినీటి పథకం

Published Thu, Jun 8 2017 6:12 PM

కలిగాంలో మినీ రక్షిత మంచినీటి పథకం - Sakshi

► యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభం

కొత్తూరు(పాతపట్నం): మండలంలోని కలిగాంలో తాగునీటి సమస్య తీర్చేందుకు మినీ రక్షిత మంచి నీటి పథకం మంజూరుచేస్తున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ పి.మహేష్‌ వెల్లడించారు. ఆ గ్రామస్తుల వెతలు, దీన స్థితిని తెలియజేస్తూ ‘నీటి కోసం జాగారం’ అనే శీర్షికన ఈనెల 6వ తేదీన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై అధికారులు స్పందించారు. మినీ రక్షిత మంచి నీటి పథకం పనులను యుద్ధప్రాతిపదికన సర్పంచ్‌ కె.గోవిదరావు ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభించారు. తాగునీటి సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన ‘సాక్షి’కి పలువురు కృతజ్ఞతలు తెలిపారు.

కృతజ్ఞతలు
ఏళ్ల తరబడి గ్రామస్తులు పడుతున్న నీటి సమస్యను ‘సాక్షి’లో ప్రచురించడంతో అధికారులు స్పందించారు. మంచి నీటి పథకం మంజూరు చేయడంతో సాక్షి, అధికారులకు కృతజ్ఞతలు. – లోతుగెడ్డ సుదీష్ణ, కలిగాం

రుణపడి ఉంటాం
తాగునీటి కోసం బారిక బావి వద్ద జాగారం ఉంటే గాని నీరు దొరకని పరిస్థితి. ఈ సమస్యను అధికారుల దృష్టికి ‘సాక్షి’ తీసుకువెళ్లడంతో తక్షణమే మంచి నీటి పథకం మంజూ రు చేయడం పనులు ప్రారంభించారు. సాక్షి చేసిన ప్రయత్నానికి రుణపడి ఉంటాం. --అలికాన రాములమ్మ, కలిగాం

Advertisement

తప్పక చదవండి

Advertisement