చెరువులు నిండినా ఏడుపేనా?! | Sakshi
Sakshi News home page

చెరువులు నిండినా ఏడుపేనా?!

Published Sun, Sep 25 2016 3:26 AM

చెరువులు నిండినా ఏడుపేనా?! - Sakshi

కాంగ్రెస్‌పై మంత్రి హరీశ్ ధ్వజం
 
 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘అవును  చాలా సంతోషంగా ఉంది.  చెరువుల మంత్రిగా నా ధ్యాస ఎప్పుడూ చెరువుల మీదనే ఉంటుంది. పొంగుతున్న ఆ వాగులు, ఈ ఘణపురం ఆనకట్ట పరవళ్లను చూస్తుంటే..  తెలంగాణ వచ్చిన రోజు ఎంత సంతోషం అరుుందో ఇప్పుడూ అంతే ఉంది. వరదను చూసి  మా రైతన్నల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోంది, కానీ కాంగ్రెస్ వాళ్లకే దుఃఖం వస్తోంది.  ఇంత బాగా వర్షాలు కురిస్తే కేసీఆర్‌కు మంచి పేరు వస్తోందని, పోరుున వానలు అటే పోక ఎందుకు కురుస్తున్నయ్ అని వాళ్లు  బాధపడిపోతున్నరు’ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

శనివారం ఘణపురం ఆనకట్ట మీద నిలబడి మంజీర నది ఉధృతిని పరిశీలిస్తూ ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన మాటల్లోనే... ‘‘భారీ వర్షాల కారణంగా సహజంగా వచ్చే జలాల కంటే  1.10 లక్షల క్యూసెక్కుల నీరు వరద రూపంలో అదనంగా వచ్చింది. దీనికి 60 వేల క్యూసెక్కుల  జలాలను జత కలిపి 1.70 వేల క్యూసెక్కుల నీళ్లను నిజాంసాగర్ వైపు మళ్లించాం. సిం గూరు సామర్థ్యం 29.99 టీఎంసీలు కాగా ప్రస్తుతం 25.8 టీఎంసీల నీళ్లున్నారుు. ఆదిలాబాద్ జిల్లా కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టు 2.69 లక్షల క్యూసెక్కుల నీరు చేరుకుంది. శ్రీరాంసాగర్‌లో  68 టీఎంసీల నీళ్లు చేరారుు.  పక్క రాష్ట్రం నుంచి భారీగా వరద చేరుతోంది. ఎగువ మా నేరు, దిగువ మానేరు పూర్తిగా నిండినవి. మూ సినదిలోకి 35 వేల క్యూసెక్కుల నీళ్లు చేరారుు. చెరువులు నిండుకుండల్లా కనిపిస్తున్నారుు.

 మిషన్  కాకతీయ ఫలాలు
 మిషన్  కాకతీయ ఫలాలు అందుతున్నారుు. మెదక్ జిల్లాలో 7,700 చెరువులు ఉంటే 5,200 చెరువులు నిండాయని, మిగిలిన చెరువల్లో 75 శాతం వరకు నీళ్లు చేరారుు. రాష్ట్రం అంతటా ఇదే పరిస్థితి ఉంది. ఈ జలాలు రబీ అవసరాలకు, వచ్చే ఏడాది ఖరీఫ్‌కు కూడా సరిపోతారుు. మల్లన్న సాగర్‌ను పూర్తి చేసి రైతన్నల కళ్లలోని ఆ ఆనందం  శాశ్వతంగా ఉండేలా సీఎం కేసీఆర్  ఆలోచన చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డం పడుతోంది.  ఎన్ని అడ్డంకులు సృష్టిం చినా కచ్చితంగా మల్లన్న సాగర్‌ను పూర్తి చేస్తాం. 

భారీ వర్షాల కారణంగా చిన్న ప్రాణిని కూడా పోగొట్టుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. దురదృష్టవశాత్తు చనిపోరుున వారి కుటుంబానికి రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తాం. వరదల్లో  పంటలు మునిగిపోరుున రైతులకు అండగా ఉంటాం. చెరువులు తెగిన చోట యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టడానికి  రెవెన్యూ, పోలీసు, ఇతర అధికారులను సిద్ధంగా ఉంచాం. నీట మునిగిన లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించి, పునారావాస కేంద్రాలను ఏర్పాటు చేశాం. పరిస్థితి సద్దుమణిగే వరకు ఈ పునరావాస కేంద్రాలను కొనసాగిస్తాం’’ అంటూ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

Advertisement
Advertisement