‘కౌలు’కోనివ్వరు! | Sakshi
Sakshi News home page

‘కౌలు’కోనివ్వరు!

Published Tue, Sep 13 2016 12:02 AM

తప్పుడు వివరాలు నమోదుచేసిన రుణ అర్హత కార్డు - Sakshi

అపరిష్కతంగా కౌలు రైతుల సమస్యలు
ఇంకా 45వేల మందికి అందని కార్డులు
 350మందికే అందిన రుణాలు
రుణప్రణాళికలోనూ తక్కువ మొత్తంలో∙కేటాయింపులు
 
బొబ్బిలి రూరల్‌ : కౌలు రైతులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఎన్నిమార్లు ధర్నా చేసినా వీరి సమస్యలు పరిష్కారం కావట్లేదు. జిల్లాలో 60నుంచిl70వేల మంది వరకు కౌలు రైతులున్నారు. వీరు జిల్లాలో దాదాపు 50శాతానికి పైగా భూమిని కౌలుకు తీసుకుని పండిçస్తున్నారు. వీరిలో కేవలం 15వేలమందికే గుర్తింపు కార్డులు ఇచ్చారు. అందరికీ కార్డులు రాకపోవడంతో 2011 భూఆధీకత చట్టాన్ని అమలుచేయకుండా అన్యాయం చేస్తోంది. ఈ ఏడాది వ్యవసాయ రుణ ప్రణాళికలోనూ వీరి కేటాయింపులు తక్కువగాన ఏ ఉన్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ. 660కోట్లు రుణంగా ఇవ్వాలని నిర్ణయిస్తే... కేవలం 350మందికి రూ. 2.9కోట్లు అందించి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది.
నమోదులోనూ జిమ్మిక్కులు
కౌలు రైతుల వివరాలు çపూర్తిస్థాయిలో నమోదుచేయకుండా ప్రభుత్వం రకరకాల జిమ్మిక్కులు చేస్తోంది. దీనివల్ల అన్నిరకాలుగా వీరు నష్టపోతున్నారు. వీరికి గుర్తింపుకార్డులు పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడంతో భూయజమానులే రుణాలు తీసుకుంటూ పంటలు నష్టపోయిన సమయంలో నష్టపరిహారం కూడా వారే అనుభవిస్తున్నారు. పంటలు పండించిన రైతు నష్టాల్లో కూరుకుపోతున్నాడు. విత్తనాలు, ఎరువుల రాయితీలు పొందలేకపోతున్నారు. ఎన్నో ఏళ్లనుంచి కౌలుకు తీసుకున్న భూముల వివరాలను బాగా తగ్గించి చూపుతూ తప్పుడు లెక్కలు అందిస్తోంది. బొబ్బిలి మండలం రంగరాయపురం గ్రామంలో దాదాపు 50మంది కౌలు రైతులు 150ఎకరాలకు పైగా సాగుచేస్తుండగా రికార్డుల్లో కేవలం 60ఎకరాలకే నమోదు చేశారు. 
 
 
సాగు చేస్తున్నది 2.5ఎకరాలు... రికార్డులో 34సెంట్లు– రెడ్డి సూరపునాయుడు, కౌలురైతు, రంగరాయపురం
గత ఐదేళ్లుగా రెండున్నర ఎకరాలు కౌలుకు సాగుచేస్తున్నాను. ఇటీవల ప్రభుత్వం నాకు రుణ అర్హత కార్డు ఇచ్చింది. అందులో కేవలం 34సెంట్లు మాత్రమే చేస్తున్నట్టు నమోదు చేసింది. నాకు న్యాయం చేయాలి. భూయజమాని అంగీకరించినా అధికారులు ఇలా ఇవ్వడం అన్యాయం.
 
ఎకరా85సెంట్లుగా ఇచ్చారు – గండి భాస్కరరావు, కౌలురైతు, రంగరాయపురం
 
మూడేళ్లుగా మూడున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాను. నాకు ఒక ఎకరా 85సెంట్లుగా నమోదుచేసి రుణఅర్హత కార్డు అందించారు. ఇదేం పద్ధతి. బ్యాంకుల చుట్టూ రుణాలకోసం తిప్పుతున్నారు.
 
న్యాయం చేయాలి– కొల్లి గంగునాయుడు, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు, విజయనగరం 
 
కౌలు రైతులకు న్యాయం చేయాలి. గుర్తింపుకార్డులు ఇవ్వడంలేదు. రుణాలు ఇవ్వడం లేదు. బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నారు. భూయజమానులు రుణాలు తీసుకోవడం వల్ల రైతులకు ఎలాంటి రాయితీలు రావడంలేదు. కౌలు రైతులకు న్యాయం చేయాలి.
 
 

Advertisement
Advertisement