ఎమ్మెల్యే చెవిరెడ్డి తాత మృతి | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే చెవిరెడ్డి తాత మృతి

Published Sun, Apr 24 2016 3:45 PM

MLA Chevireddy Bhaskar Reddy's grandfather passed away

తిరుపతి రూరల్ : చిత్తూరు జిల్లా చంద్రగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తాత చెవిరెడ్డి మునిరెడ్డి (97) ఆదివారం ఉదయం మృతి చెందారు. ఆరోగ్యంగా తిరుగుతుండే ఆయన ఆకస్మికంగా మరణించడం పట్ల పలువురు దిగ్భ్రాంతికి లోనయ్యారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జనరల్ సెక్రటరీ విజయ్‌సాయి రెడ్డి, ఎంపీ మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే రోజా తదితరులు తుమ్మగుంట గ్రామానికి చేరుకుని నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement