Sakshi News home page

మోదీ రైతు పక్షపాతి

Published Sat, Nov 12 2016 8:55 PM

modhi formers suport

  • వచ్చే 5 ఏళ్లలో అన్నదాత రాబడి రెట్టింపు చేయడానికి కృషి 
  • బీజేపీ కిసా¯ŒSమోర్చా అధ్యక్షుడు పూడి తిరుపతిరావు
  • బోట్‌క్లబ్‌ (కాకినాడ) :
    ప్రధాని నరేంద్ర మోదీ రైతు పక్షపాతి అని, బీజేపీ అధికారంలోకి వచ్చాక రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని ఆ పార్టీ కిసా¯ŒSమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పూడి తిరుపతిరావు చెప్పారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టే నాటికి రైతులు దీనస్థితిలో ఉన్నారన్నారు. రాబోయే ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా చర్యలు తీసుకొంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రైతులకు తెలియజేసేందుకు ఈ నెల 26న పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో  రైతు మహాసభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హాజరవుతారన్నారు. ఇప్పటికే ఈ సభ నిర్వహణకు సన్నాహక సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. ఉత్పత్తి వ్యయం తగ్గించి రైతులకు మేలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. రైతుల కోసం పసల్‌ బీమా అమలు చేస్తున్నారని, పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి చేస్తారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రమే  పూర్తిగానిధులు మంజూరు చేస్తుందన్నారు. రైతులకు ఇచ్చే రుణాలపై వడ్డీ మాఫీ కోసం గత బడ్జెట్‌లో రూ.18,500 కోట్లు కేటాయించారన్నారు. ఉభయగోదావరిజిల్లాలో నుంచే కాక రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచీ లక్షమందికి పైగా రైతులు అమిత్‌షా సభలో పాల్గొనేలా సన్నాహాలు చేస్తున్నామన్నారు. నల్లధనాన్ని వెలికితీసేందుకు మోదీ చేసిన పాత నోట్ల రద్దుకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. ప్రస్తుతం ప్రజలకు ఇబ్బందులు కాస్త తగ్గాయన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, నగర అధ్యక్షుడు పెద్దిరెడ్డి రవికిరణ్, జిల్లా మాజీ అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement
Advertisement