పైసలిస్తేనే పని | Sakshi
Sakshi News home page

పైసలిస్తేనే పని

Published Mon, Sep 19 2016 12:23 AM

పైసలిస్తేనే పని

  • ఆర్టీఓలో వాహన పర్మిట్ల దందా
  • జిల్లా దాటాలంటే చేయి తడపాల్సిందే
  • చక్రం తిప్పుతున్న దళారులు
  • రిజిస్ట్రేషన్‌కు వెళితే జేబుకు చిల్లే..
  • అధికారుల అండతోనే వ్యవహారం
  •  
    సాక్షి, హన్మకొండ : 
    క్యాష్‌లెస్‌ సేవలంటూ ఆర్భాటంగా ప్రకటించినా.. జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో డబ్బు ముటజెప్పకుండా ఫైలు ముందుకు కదలడం లేదు. ఇతర జిల్లాల్లో వాహనం నడిపేందుకు అనుమతి (పర్మిట్‌) రావాలంటే తొలుత ఆర్టీఓ కార్యాలయంలో దళారుల చేయి తడపాల్సిందే. ఆర్టీఓ కార్యాలయం అడ్డాగా ప్రతీ పనికి ఓ ధర నిర్ణయించి వాహన యజమానులను నిలువుదోపిడీ చేస్తున్నారు.
     
    పర్మిట్‌ రాజాదే పెత్తనం..
    బస్సులు, లారీలు తదితర భారీ వాహనాలు జిల్లా దాటి వెళ్లాలంటే తప్పనిసరిగా రవాణాశాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. జిల్లాకు చెందిన లారీలు, బస్సులు, ట్రాలీలు నిత్యం ప్రయాణికులు, సరుకులు తీసుకుని ఇతర జిల్లాలకు వెళ్తుంటాయి. ఇందుకోసం జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో సంబంధిత దరఖాస్తు పత్రాలు నింపి, నిర్దేశిత రుసుము చెల్లిస్తే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. వరంగల్‌ ర వాణాశాఖ కార్యాలయంలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. ఇక్కడ పర్మిట్‌ రాజాగా పేరొందిన దళారీ చెంతకు వెళ్లిన వాహన యజమానులకు సకాలంలో అనుమతులు వస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలు నమ్ముకున్న వారిని ముప్పు తిప్పలు పెడుతున్నారు. 
     
    రిజిస్ట్రేషన్లకూ ఇబ్బందే..
    నూతన వాహనాలకు జిల్లా రవాణాశాఖ కా ర్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే దళారులను కాదని నేరు గా దరఖాస్తు చేసుకుంటే పనులు కావడం లేదు. ముఖ్యంగా నాలుగు చక్రాల వాహనాల రిజిస్ట్రేషన్‌ మరీ ఇబ్బందిగా మారుతోంది. ఇక్కడ చక్రం తిప్పుతున్న పర్మిట్‌ రాజాను ఆశ్రయిస్తే  పని అయిపోయినట్టే. 
     
    అధికారుల అండదండలతోనే..
    ఆర్నెళ్ల కిత్రం దళారులకు ప్రవేశం లేదని చెప్పిన కార్యాలయంలోనే అడుగడుగునా దళారులు విజృంభిస్తున్నారు. అయినా అధికా రులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. వాహనాల రిజిషే్టష్రన్లు, పర్మిట్ల వ్యవహారం చూస్తు న్న దళారులు ఇతర దళారులపైనే పెత్తనం చెలాయిస్తున్నారు. వీరికి ఉన్నతాధికారులు అండదండలు ఉన్నాయనే ఆరోపణలు విని పిస్తున్నాయి. దళారులు తప్పుడు లెక్కలు చెప్పకుండా ఉండేందుకు రోజుకు ఎన్ని వాహనాలకు పర్మిట్‌ ఇచ్చారు, ఎన్ని వాహనాలు రిజిస్ట్రేషన్‌ అయ్యాయో చూసేందుకు అనధికారికంగా ఒకరు ఇక్కడ పని చేస్తున్నట్లు సమాచారం.  ఈ వ్యక్తి అందించే లెక్కల ఆధారంగా అధికారులు, సిబ్బంది, దళారులు వాటాలు పంచుకుంటున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement