మృత్యు పంజా | Sakshi
Sakshi News home page

మృత్యు పంజా

Published Sat, Nov 26 2016 1:58 AM

మృత్యు పంజా

మృత్యువు పంజా విసిరింది. దారి కాసి నలుగురిని కబళించింది. వేర్వేరు చోట్ల జరిగిన ఈ దుర్ఘటనలు ఆ కుటుంబాల్లో విషాదం నింపాయి. 
 
గామ¯ŒSబ్రిడ్జి వద్ద ఇద్దరి మృతి 
కొవ్వూరు : పట్టణ శివారున నాలుగోరోడ్డు వంతెన(గామన్‌ బ్రిడ్జి) జంక్ష¯ŒS వద్ద దొమ్మేరు వైపు నుంచి వస్తున్న మోటారు సైకిల్‌ని లారీ ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. 
పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం తోటవీధికి చెందిన శివన్నారాయణ(38) కుటుంబంతో సహా రెండేళ్లుగా కొవ్వూరు మండలం దొమ్మేరులో నివాసం ఉంటున్నాడు. శివన్నారాయణ దొమ్మేరుకు చెందిన తాపీమే్రస్తి సాధనాల సర్వేశ్వరరావు(36)తో కలిసి తాపీ పనులు చేస్తున్నాడు. వీరిద్దరూ శుక్రవారం భవన నిర్మాణానికి అవసరమైన సామగ్రి కొనుగోలుకు శివన్నారాయణ మోటారు సైకిల్‌పై కొవ్వూరు బయలుదేరారు. కొవ్వూరు నాలుగో రోడ్డు వంతెన జంక్ష¯ŒS సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో  మోటారుసైకిల్‌ ముందు భాగం తునాతునకలైంది. శివన్నారాయణ తల రెండు భాగాలుగా విడిపోయి మెదడు బయట పడడంతో అక్కడికక్కడే మరణించాడు.  తీవ్రంగా గాయపడిన సర్వేశ్వరరావును 108 అంబులెన్సులో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే కొద్దిసేపటికే అతను కూడా ప్రాణాలు విడిచాడు. శివన్నారాయణ భార్య ఈశ్వరి తాతయ్య అయిన ఆర్టీసీ మెకానిక్‌  మహ్మద్‌ సర్దార్‌ స్వగ్రామం దొమ్మేరు కావడంతో రెండేళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. రెండు నెలల కిత్రమే శివన్నారాయణ గోపాలపురానికి చెందిన అత్త గుల్లపల్లి లక్ష్మి పేరుతో కొత్త మోటార్‌ సైకిల్‌ కొన్నాడు. ఇంతలోనే ప్రమాదంలో అతను మృతిచెందాడు. ఈశ్వరి భర్త మృతదేహం వద్ద గుండెలసేలా రోదించిన తీరు చూపరులను కలచివేసింది. శివన్నారాయణకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. సర్వేశ్వరరావుకు భార్య, కుమార్తె,  కుమారుడు ఉన్నారు. పట్టణ ఎస్‌ఐ డి.గంగాభవానీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శివన్నారాయణ భార్య ఈశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. శివన్నారాయణ మృతదేహాన్ని కొవ్వూరు మార్చురీ తరలించారు. 
 
సైకిల్‌పై వెళ్తుండగా, లారీ ఢీకొని.. 
నిడదవోలు : సమిశ్రగూడెంలోని పశ్చిమడెల్టా ప్రధాన కాలువ వంతెనపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సమిశ్రగూడేనికి చెందిన అబ్దుల్‌ రఫీ (63) నిడదవోలు నుంచి ఇంటికి సైకిల్‌పై వస్తుండగా  కానూరు వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108లో ఆయనను నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ రఫీ మృతిచెందాడు.  నిడదవోలు రూరల్‌ ఏఎస్‌ఐ ఎ. శ్రీరామచంద్రమూర్తి కేసు దర్యాప్తు చేపట్టారు. 
 
వివాహానికి వెళ్తూ.. 
పోడూరు : జగన్నాథపురంలో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. పెనుమంట్ర గ్రామానికి చెందిన బొంతు శేఖర్‌ (18) అతని స్నేహితులు బాలం సువర్ణప్రసాద్, బొంతు సత్యనారాయణ పాలకొల్లులో జరిగే వివాహానికి పెనుమంట్ర నుంచి రాత్రి పదకొండున్నర సమయంలో మోటార్‌ సైకిల్‌పై బయలుదేరారు. జగన్నాథపురం వంతెన వద్దకు చేరుకునే సరికి లారీని తప్పించబోయి ఎదురుగా వస్తున్న మోటార్‌ సైకిల్‌ను ఢీకొని ముగ్గురూ కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో లారీ శేఖర్‌ కాలుపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇదే వివాహానికి వెనుకనే వస్తున్న శేఖర్‌ స్నేహితులు ప్రమాదం గమనించి శేఖర్‌ని పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించేందుకు యత్నిం చారు. అయితే మార్గ మధ్యలోనే అతను మరణించాడు. ఈ ప్రమాదంలో సువర్ణప్రసాద్‌కూ గాయాలు కావడంతో అతనిని భీమవరం ఆసుపత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన బొంతు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ టి.రవీంద్రబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement
Advertisement