‘నా మనసు నిన్ను కోరుకుంది’ : బాలాజీ | Sakshi
Sakshi News home page

‘నా మనసు నిన్ను కోరుకుంది’ : బాలాజీ

Published Thu, Feb 25 2016 1:46 AM

‘నా మనసు నిన్ను కోరుకుంది’ : బాలాజీ

కామవరపుకోట : గ్రామంలో వీరభద్రస్వామి తిరునాళ్లకు బుధవారం సినీ, టీవీ నటులు బాలాజీ, యాంకర్ శైలజ, వైజాగ్ ధనరాజ్ హాజరయ్యారు. తిరునాళ్లల్లో ఏర్పాటు చేసిన సత్య మ్యూజికల్ డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొని డ్యాన్సర్లతో కలిసి స్టెప్పులు వేశారు. తొలుత తిరునాళ్లలో భాగంగా ఏర్పాటు చేసిన వీరభద్రస్వామి రథోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

 బాలాజీ విలేకరులతో
 ఈ సందర్భంగా బాలాజీ విలేకరులతో మాట్లాడుతూ నటనపై మక్కువతో సినీ రంగ ప్రవేశం చేశానని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం తన స్వగ్రామమని అన్నారు. ఇటీవల టీవీరంగంలో వస్తున్న నూతన కార్యక్రమాలు నటులకు అవకాశాలు పెంచుతున్నాయన్నారు. తాను ‘నా మనసు నిన్ను కోరుకుంది’ అనే సినిమాను నిర్మిస్తున్నానని, అలాగే నక్షత్ర సినిమాలో హీరోయిన్ తండ్రిగా మంచిపాత్ర చేస్తున్నట్లు తెలిపారు.

 రాంచరణ్ సినిమాతో పాటు,
 ఎన్టీఆర్ జనతా గ్యారేజీ, కొరటాల శివ సినిమాలో నటిస్తున్నట్లు చెప్పారు. ఏ పనినైనా పూర్తి విశ్వాసంతో చేస్తే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చని అన్నారు.
 

Advertisement
Advertisement