వైజాగ్ వాసుల స్ఫూర్తికి మోదీ సెల్యూట్! | Sakshi
Sakshi News home page

వైజాగ్ వాసుల స్ఫూర్తికి మోదీ సెల్యూట్!

Published Sun, Feb 7 2016 6:38 PM

వైజాగ్ వాసుల స్ఫూర్తికి మోదీ సెల్యూట్! - Sakshi

విశాఖపట్నం: హుద్‌ హుద్‌ తుఫాన్ బీభత్సం నుంచి విశాఖపట్నం వాసులు 14 నెలల్లోనే తేరుకున్నారని, విశాఖ వాసుల స్ఫూర్తి అభినందనీయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. విశాఖపట్నంలో జరుగుతున్న అంతర్జాతీయ యుద్ధనౌక సమీక్షలో ఆదివారం పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా ప్రసంగించారు. విశాఖపట్నం అందమైన నగరమని, ఈ నగరం తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు. హుద్‌ హుద్‌ విలయం సృష్టించిన సమయంలో తాను విశాఖపట్నానికి వచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. విశాఖ వాసులకు స్ఫూర్తికి సెల్యూట్ అని పేర్కొన్నారు. అదేవిధంగా విశాఖపట్నంలో జరుగుతున్న అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష చరిత్రాత్మకమని, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నౌకాదళానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలిచిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఆయన తన ప్రసంగంలో ఏమన్నారంటే..
 

  • ఫ్లీట్ రివ్యూ (యుద్ధనౌకల సమీక్ష)ను అద్భుతంగా నిర్వహించిన నౌక దళానికి అభినందనలు
  • ఈ అద్భుత కార్యక్రమానికి ప్రపంచ నలుమూలల నుంచి ప్రతినిధులు వచ్చారు
  • తీరప్రాంత దేశాలతో ఆర్థిక, వాణిజ్య సంబంధాల బలోపేతానికి మారిటైమ్ ఉపయోగపడుతుంది
  • సముద్రాల ద్వారానే 90శాతం వాణిజ్యం కొనసాగుతోంది
  • సముద్వాల ద్వారా అంతర్జాతీయంగా 20 ట్రిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరుగుతోంది
  • సముద్ర మార్గ వాణిజ్యానికి సునామీ, తుఫాన్ వంటి ప్రకృతి వైపరీత్యాలు సవాలు విసురుతున్నాయి
  • అన్ని దేశాల నౌకాదళాలు భద్రతపై సమిష్టిగా దృష్టి సారించాలి
  • గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీ కోసం మేం బిలియన్ డాలర్లు ఖర్చు చేశాం
  • ఈ ఏడాది ఏప్రిల్‌లో గ్లోబల్ మారిటైమ్ సమ్మిట్ నిర్వహిస్తాం
  • తీరప్రాంత రాష్ట్రాలన్నీ యువతకు శిక్షణ ఇవ్వాలి
  • తీరప్రాంత భద్రత ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకం
  • భారత్ సముద్రతీర విధానాన్ని మారిషస్‌లో ఇటీవల ప్రకటించాం
  • భారత్‌కు 7,500 చదరపు కిలోమీటర్ల తీరప్రాంతముంది
  • సార్క్ దేశాలతో మన సంబంధాలు బాగున్నాయి
  • సింధు నాగరికత నాటి నుంచి ప్రపంచదేశాలతో భారత్‌కు సత్సంబంధాలు ఉన్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement