అంతుచిక్కని వ్యాధితో 56 గొర్రె పిల్లల.. | Sakshi
Sakshi News home page

అంతుచిక్కని వ్యాధితో 56 గొర్రె పిల్లల...

Published Wed, Sep 14 2016 11:29 PM

మతి చెందిన గొర్రె పిల్లలు

శ్రీకూర్మం (గార ) : తమను ఆర్థికంగా నిలబెడతాయనుకున్న గొర్రెలు ఒకేసారి మతి చెందడంతో పెంపకందారులు లబోదిబోమంటున్నారు. శ్రీకూర్మం పంచాయతీ కోళ్లపేట గ్రామం కోండ్రు పైడయ్య, కోండ్రు అప్పలరాజు, బాకి అప్పలరాజు, బాకి లక్ష్మణలకు చెందిన గొర్రెలను దువ్వుపేట సమీపంలోని సముద్రపు దిబ్బలపై ఉంచారు. మంగళవారం రాత్రి గూడుల్లో ఉన్న  56 గొర్రె పిల్లలు ఒకేసారి మత్యువాత పడ్డాయి. దీంతో సుమారు రూ. 3లక్షలకు పైగా నష్టం  జరిగిందని పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేశారు. గార పశువైద్యాధికారి కె.నారాయణమూర్తి పోస్టుమార్టం నిర్వహించి శాంపిల్స్‌ను లేబొరేటరీకి పంపించారు. రైతులు చలి పిడుగు పడి మతి చెందాయని భావిస్తుండగా వైద్యులు మాత్రం యాష్‌పిక్సియా అనే వ్యాధితో చనిపోయి ఉండవచ్చని, ఉన్నతాధికారులకు సమాచారమిచ్చామని తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సర్పంచ్‌ బరాటం రామశేషు ఆర్థికంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలని  కోరారు. 
   
 

Advertisement
Advertisement