నాలా వ్యవస్థ సరిగ్గా లేక ముంపు | Sakshi
Sakshi News home page

నాలా వ్యవస్థ సరిగ్గా లేక ముంపు

Published Sat, Sep 24 2016 11:23 PM

అల్వాల్‌లో ముంపు బాధితులకు ఆహారం అందజేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి సబితారెడ్డి

అల్వాల్‌:  వరద సహాయక చర్యలను ప్రభుత్వం వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అల్వాల్‌లో శనివారం మాజీ మంత్రి సబితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మల్కాజిగిరి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి నందికంటి శ్రీధర్‌తో కలిసి ముంపు బాధితులను పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ శ్రేణులందరూ సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా పిలుపునిచ్చామన్నారు. అల్వాల్‌లో ఉన్న చెరువులకు అనుగుణంగా నాలా వ్యవస్థ లేకపోవడం వల్లే ముంపు సమస్య నెలకొందని ఇందుకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు.

ముంపునకు గురైన వారందరికీ అవసరమగు సహాయక చర్యలను ప్రభుత్వం వేగవంతం చేయాలని కోరారు. భూదేవినగర్‌ గుడిసెవాసులతో మాట్లాడి అన్నదానంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నాయకులు బండారి లక్ష్మారెడ్డి, తెలంగాణ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు అనిల్‌కుమార్‌ యాదవ్, నాయకులు సాయిజెన్‌ శేఖర్, డోలి రమేష్, గీతారాణి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement