ప్రకృతి కొలను! | Sakshi
Sakshi News home page

ప్రకృతి కొలను!

Published Sat, Aug 6 2016 11:32 PM

swimming - Sakshi

ఉలవపాడు:  
- ఈతలో జాతీయ స్థాయికి ఎదిగిన ఉలవపాడు మహిళ
-  నేషనల్స్‌లో 12 పతకాలు కైవసం
-  ఆం్రధ తొలి కోచ్‌గా అవకాశం 
నీళ్లంటే అందరికీ ఇష్టం.. కానీ అవే నీళ్లు కొలనుల్లోనో.. కాలువల్లోనో.. సముద్రాల్లోనే ఉంటే? వెన్ను వణుకుతుంది. ఇలాంటి జలాలతో ఉలవపాడుకు చెందిన మహంకాళి ప్రకృతి అనే మహిళ ఆటాడుకుంటారు. ఈత పోటీలు పెడితే జాతీయ స్థాయిలో కప్పు సాధిస్తారు. సీనియర్‌ క్రీడాకారిణిగా ఎన్నో పతకాలు సాధించన తర్వాత ఇటీవల ఆంధ్ర కోచ్‌గా అవకాశం చేజిక్కించుకున్నారు.   
చిన్నతనం నుంచే ప్రకృతి.. నీటిపై ప్రేమ పంచుకుంది. అది తనను చాంపియన్‌గా చేసింది. గ్రామానికి చెందిన రిటైర్డు కార్యదర్శి మహంకాళి వెంకటేశ్వర్లు కుమార్తె దేశానికే ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం. ప్రస్తుతం ఇండియా తర ఫున ఈత ట్రయల్స్‌లో పాల్గొనడం గమనార్హం. పది రోజుల క్రితం నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌లో స్విమ్మింగ్‌ క్యాంప్‌ పూర్తి చేయడంతో కోచ్‌ హోదా సాధించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ తరుఫున తొలి మహిళా కోచ్‌గా మారారు. ఈమె జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌ తరఫున సత్తా చాటరు. ఫ్రీసై్టల్‌ స్ట్రోక్, బ్యాక్‌ స్ట్రోక్‌  విభాగాల్లో దూసుకెళ్లారు. మొత్తం 12 వెండి, రజత పతకాలను సాధించారు. రాష్ట్ర స్థాయిలో అధిక భాగం బంగారు పతకాలతో 70 కైవసం చేసుకున్నారు. ఉలవపాడులోని చిన్న గుంతలో ఈత ప్రారంభించి ఇప్పుడు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకృతిని స్థానికులు అభిన ందించారు. తన తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, విజయలక్ష్మిల సహకారంతోనే తాను ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. మహిళగా దీనికి గర్వపడుతున్నానన్నారు. 
 

Advertisement
Advertisement