దివ్యక్షేత్రంగా నెల్లిబండ గుట్ట | Sakshi
Sakshi News home page

దివ్యక్షేత్రంగా నెల్లిబండ గుట్ట

Published Thu, Jul 21 2016 11:40 PM

దివ్యక్షేత్రంగా నెల్లిబండ గుట్ట

నకిరేకల్‌ :  మండలంలోని నెల్లిబండ గుట్టపై వెలసిన శ్రీ లింగమంతుల స్వామి దేవాలయం రాబోయే రోజుల్లో ఒక దివ్యక్షేత్రంగా వెలుగొందనుందని నల్లగొండ సామిర్‌ పంచనన దివ్యపీఠం పీఠాధిపతి వేదాంతం రామకృష్ణమాచార్యులు పేర్కొన్నారు.  గురువారం ఆయన గుట్టపై ఉన్న దేవాలయాన్ని, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. గుట్టపై ఇరువైపులా ఆంజనేయస్వామి, శంకరుడు విగ్రహాలను, దేవాలయ ఆర్చి నిర్మాణం కోసం వాస్తు చూశారు. గుట్టపైకి దారి, మెట్ల మార్గంకోసం నిర్మాణం ఎక్కడి నుంచి చేపట్టాలో సూచించారు.  నెల్లిబండ  గుట్టకు చరిత్ర ఉన్నందున భవిష్యత్‌లో దివ్యక్షేత్రంగా మారబోతుందన్నారు. ఇక్కడ భక్తులు 40 రోజుల పాటు దీక్షలు పూనుకుని భక్తిభావం పెంపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో   సర్పంచ్‌ ముస్కు పాపమ్మ, ఎంపిటిసి యానాల శేఖర్‌రెడ్డి, దేవాలయ చైర్మన్‌ యానాల శ్రీనివాస్‌రెడ్డి, వెంకటాచారి తదితరులు ఉన్నారు. 
 

Advertisement
Advertisement