రూ. 30 వేల 60 కిలోల చేప! | Sakshi
Sakshi News home page

రూ. 30 వేల 60 కిలోల చేప!

Published Sun, Nov 6 2016 8:24 PM

రూ. 30 వేల 60 కిలోల చేప!

ఉలవపాడు: ప్రకాశం జిల్లా రామాయపట్నం సముద్రతీరంలో మత్స్యకారుల వలకు నెమలికిచ్చకోణం చేప చిక్కింది. సుమారు 60 కిలోల బరువు, 4.5 అడుగల పొడవు ఉన్న ఈ చేపకు నెమలితోక మాదిరి నీలిరంగులో రెక్క, పొడవాటి ముక్కు ఉన్నాయి.

అరుదుగా వలలో చిక్కే వీటి ధర కిలో రూ.500 నుంచి రూ.600 వరకు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు. రూ. 30 వేలకుపైగా విలువైన ఈ చేపను సింగరాయకొండ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు.

Advertisement
Advertisement