నిడదవోలు రైల్వేగేటు మూసివేత | Sakshi
Sakshi News home page

నిడదవోలు రైల్వేగేటు మూసివేత

Published Fri, Sep 16 2016 10:34 PM

నిడదవోలు రైల్వేగేటు మూసివేత - Sakshi

నిడదవోలు :ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన రాకపోకల కోసం ఏర్పాటుచేసిన నిడదవోలు రైల్వేగేటును శుక్రవారం అధికారులు మూసివేశారు. రైల్వే టెక్నికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంకు చెందిన గ్యాంగ్‌ ట్రాక్‌ మరమ్మతు పనులు చేపట్టారు. పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 22 వరకు వారం రోజుల పాటు గేటు మూసి ఉంటుంది. పోలీసులు వాహనాల మళ్లింపు చర్యలు చేపట్టారు. రెండేళ్లకు ఒక్కసారి గేటు వద్ద ట్రాక్‌ మరమ్మతులు చేపడతారు. రైల్వేగేటు ఇరువైపులా తాత్కాలిక గేట్లను ఏర్పాటుచేసి హెచ్చరిక బోర్డులను ఉంచారు. 
ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు 
గేటు మూసివేయడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. బస్సులో ప్రయాణించేవారికి మాత్రం కాస్త ఉపశమనం ఉంది. ఇటు తాడేపల్లిగూడెం నుంచి అటు రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి బస్సులను ఆర్టీసీ గేటు వరకూ నడుపుతోంది. గేటు వద్ద ప్రయాణికులు బస్సు దిగి ఆవలివైపున ఉన్న మరో బస్సు ఎక్కుతున్నారు. అయితే తాత్కాలిక గేటులతో సహా మొత్తం నాలుగు గేట్ల కింద నుంచి వంగి ప్రయాణికులు ట్రాక్‌ దాటడానికి ఇబ్బందులెదుర్కొంటున్నారు. వద్ధులు, చంటి పిల్లల తల్లులు ఆపసోపాలు పడుతున్నారు. రైల్వే సిబ్బంది గేటు వద్దనే ఉండి ఎప్పటికప్పుడు రైళ్ల రాకపోకల సమాచారం అందిస్తూ ట్రాక్‌ దాటే ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నారు. 
మోటారు సైకిల్‌ వంతెన దాటించేందుకు రూ.
రైల్వేగేటు మూసివేయడంతో రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉన్న రైల్వే కాలిబాట వంతెనపై విపరీతమైన ట్రాఫిక్‌ ఉంటోంది. తాడేపల్లిగూడెం, తాళ్లపాలెం, శెట్టిపేట, నందమూరు తదితర ప్రాంతాలకు వెళ్లడానికి మోటారు సైకిలిస్ట్‌లు కాలిబాట వంతెనను ఆశ్రయిస్తున్నారు. స్థానిక యువకులు ప్రయాణికుల వద్ద రూ.20 నుంచి రూ.30 వరకూ తీసుకుని మోటారు సైకిళ్లను వంతెన దాటిస్తున్నారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement