పరిష్కారం ఎలా‘గండి’ | Sakshi
Sakshi News home page

పరిష్కారం ఎలా‘గండి’

Published Tue, Aug 23 2016 10:50 PM

:సైపూన్‌ పైనుండి ప్రవహిస్తున్న ఒట్టిగెడ్డ నీటిని మళ్ళించేందుకు ఇసుక బస్తాలు వేస్తున్న దశ్యం

అంతుచిక్కని సమస్యగా సైపూన్‌ మరమ్మత్తులు 
పరిష్కారంపై నిర్ధారణకు రాలేని ఇంజనీరింగ్‌ నిపుణులు 
సైపూన్‌ను పరిశీలించిన నిపుణుల బందం 
పరిష్కార మార్గాలకు మల్లగుల్లాలు
ఏం చేస్తే ఏమవుతుందోనని ఆందోళన 
మరో 20 రోజుల వరకు ఇదే పరిస్ధితి
50 వేల ఎకరాల వరి పంటకు పెనుముప్పు
ఆందోళనలో ఆయకట్టు రైతులు
 
జియ్యమ్మవలసః తోటపల్లి ప్రాజెక్టు పరిది లోని నాగావళి ఎడమకాలువకు ఈనెల 18న పెద్దబుడ్డిడి–సంతనర్సిపురం మద్యలో  సైపూన్‌ వద్ద పడిన గండి సమస్య మరింత సంక్లిష్టంగా  మారింది.   సైపూన్‌ గండీ సమస్య పరిష్కారం కోసం మంగళవారం వచ్చిన రాష్ట్ర ఉన్నత స్ధాయి ఇంజనీరింగ్‌ నిపుణుల బందం ఓ నిర్ణయానికి రాలేక పోవడం రైతాంగానికి ఆందోళన కలిగిస్తోంది.ఇప్పటికే వారం రోజులుగా సాగునీరు సరఫరా నిలిచిపోయింది.మరో 20 రోజులు ఇదే పరిస్ధతి కొనసాగుతుందని  స్పష్టమవుతోంది.దీంతో ఎడమకాలువ ఆయకట్టులో 50 వేల ఎకరాల వరి పంటకు పెనుముప్పు ముంచుకొస్తోంది.
 
’నిర్ధారణకు రాని నిపుణుల బందం
శ్రీకాకుళం,విజయనగరం జిల్లాలకు చెందిన జలవనరుల శాఖాధికారులు సైపూన్‌  మరమ్మత్తు పనులు తాము చేయలేమని చేతులెత్తేయడంతో ఈ మరమ్మత్తు పనులను ప్రభుత్వం రాష్ట్ర ఇంజినీరింగ్‌ చీఫ్‌ అధికారులకు అప్పగించింది.దీంతో మంగళవారం  సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గౖ¯ð జేషన్‌  ఇంజనీరింగ్‌ చీఫ్‌ గిరిధర్‌ రెడ్డి,రిటైర్డ్‌ ఇంజనీరింగ్‌ చీఫ్‌లు ఎం.కె.రెహమాన్,కె.వి.సుబ్బారావు,వైజాగ్‌ నార్త్‌ కోస్ట్‌ చీఫ్‌ ఇంజినీర్‌ సి.హెచ్‌ శివప్రసాద్‌ తదితర ఇంజినీరింగ్‌ బందం మంగళవారం సైపూన్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు.అయితే వందేళ్ళ దాటిన పురాతన కట్టడం కావడంతో మరమ్మత్తు పనులను ఎలా చేయాలో .....ఏంచేయాలో ...తెలియని పరిస్ధితుల్లో పరిష్కార మార్గాలకు మల్లగుల్లాలు అయ్యారు..సైపూన్‌ శ్లాబ్‌ను తెరిస్తే ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన వ్యక్తం చేసారు.సైపూన్‌ ఎగువ ప్రాంతాల్లో  కాలువ గుండా వచ్చే నీరు కిందకు  పడే లోతును,దిగువన నీరు పైకి వచ్చే ఎత్తును పరిగణలోకి తీసుకున్నారు.ఇంత ఎత్తు నుండి నీరు  పడుతుందంటే  సైపూన్‌ కిందన వ్యర్ధ పదార్ధాలు ఉండవచ్చుననే అభిప్రాయానికి వచ్చారు. దీంతో సైపూన్‌ గండీ సమస్య పరిష్కారంపై అధికార యంత్రాంగం ఓ నిర్ధారణకు రాలేకపోయింది. 
 
మరో 20 రోజుల వరకు ఇదే పరిస్ధితి
ఠాగూర్‌ సినిమాలో మతదేహానికి వైద్యచికిత్సలు చేసిన ఘటన మాదిరిగానే  సైపూన్‌ వద్ద పరిస్ధితి ఉందని పలువురు రైతులు వాపోతున్నారు.ఇప్పటికే ఎడమకాలువకు సాగునీరు నిలిచిపోయి వారం రోజులు గడిచింది.నిపుణుల బందం మరమ్మత్తు పనులపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో మరో 20 రోజులు ఇదే పరిస్ధితి తప్పేటట్లు లేదు. మరికొన్ని రోజులు ఇదే విధంగా కాలయాపన చేసి ఈ పనులు ఇప్పటిలో చేయలేమని అధికారులు చేతులెత్తే పరిస్ధితి స్పష్టమవుతోంది.
 
50 వేల ఎకరాల వరి పంటకు పెనుముప్పు
తోటపల్లి ఎడమ కాలువ పరిధిలో జియ్యమ్మవలస, వీరఘట్టం,పాలకొండ మండలాల్లో  ఉన్న 50 వేల ఎకరాల వరి పంటకు పెనుముప్పు తప్పేటట్లు లేదు.నిపుణుల బందం వస్తే సమస్య పరిష్కారం అవుతుందని ఎదురుచూసిన రైతాంగానికి నిరాశే మిగిలింది.గత వారం రోజులుగా నీరు లేక ఎండిపోయిన పంటలకు మరో 20 రోజులు వరకు నీరు అందకపోతే పొలాలు బీటలుగా మారి పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది.
 
’ ఆందోళనలో ఆయకట్టు రైతులు....
నీరులేక కళ్ళ ముందే పంటలు ఎండిపోతుంటే రైతన్నలు లబోదిబో మంటున్నారు.పాలకుల నిర్వాకానికి తాము బలైపోయామంటూ ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శివారు ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని అధికారులు,తెలుగుదేశం నాయకులు చెప్పిన  కల్లబొల్లి మాటలతో   మోసపోయాం. ఈ ఏడాది ఎకరాకు రూ.10 వేలు చొప్పున వీరఘట్టం,పాలకొండ మండలాల్లో రైతులకు రూ.50 కోట్లు నష్టం జరిగిందని పలువురు రైతులు వాపోతున్నారు.
 
పూర్తిగా పరిశీలించాలి
సైపూన్‌ వందేళ్ళ దాటిన కట్టడం  కావడంతో పూర్తిగా పరిశీలించిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోగలమని రిటైర్డ్‌ ఇంజినీరింగ్‌  చీఫ్‌ కె.వి.సుబ్బారావు విలేకర్లకు  తెలిపారు.ఓ పధకం ప్రకారం మరమ్మత్తు పనులు చేయాలని లేదంటే పూర్తిగా ఆయకట్టు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు.అంతవరకు అందరూ సమన్వయం పాటించాలని కోరారు.ఈ పరిశీలనలో బొబ్బిలి సెక్షన్‌ ఎస్‌.ఈ ఎం.వి.రమణమూర్తి,ఈ.ఈ.బి.రవీంద్ర,డి.ఈ.ఈ గనిరాజు,ఏ.ఈలు ఉదయ్‌భాస్కర్,రాజేష్‌కుమార్,తోటపల్లి ప్రాజెక్టు చైర్మన్‌ నిమ్మక పాండురంగ,పెదబుడ్డిడి నీటిసంఘం అధ్యక్షుడు రౌతు శశిభూషణరావు,ఎంపీటీసీ బాబూ భువనమోహనరావు,పొగిరి శ్రీరామమూర్తి తదితరులు ఉన్నారు.  
 
 

Advertisement
Advertisement