Sakshi News home page

పుష్కరస్నానంలో హై‘టెక్‌’లు..

Published Tue, Aug 16 2016 8:21 PM

పుష్కరస్నానంలో హై‘టెక్‌’లు..

సాక్షి, అమరావతి :
నది ప్రవాహ సమయంలో భకు ్తలు చెంబులతో తడుపుకొని పుణ్యస్నానం అయ్యిందనేపించేవారు గతం లో. మరి ఇప్పుడో.. పరిస్థితి తారుమారు. కృష్ణా నది నీటిలో నిండా తడిసే అవకాశం లేదు. జల్లు స్నానాలతో పుణ్యస్నానాన్నిముగించుకోవాల్సిన పరిస్థితి. 2003 పుష్కరాల్లో గోదావరికి నీటి కొరత ఏర్పడింది. నరసాపురంలో తొలి సారి షవర్లతో స్నానాలకు తెరతీశారు. ఇప్పుడు కృష్ణా పుష్కరాల్లో ప్రకాశం బ్యా రేజి దిగువన అమలుకు సిద్దం చేశారు.  
పుష్కల జలసిరిలో మూడు మునకలు వేస్తే పుష్కర స్నానం అని భక్తులు భావిస్తారు. 12 ఏళ్లకు ఒకమారు పుణ్యస్నానం చేసేందుకు ప్రజల సెంటిమెంట్‌ అంతా ఇంతా కాదు. అటువంటిది తల తడుపుకొనే అవకాశం లేకపోతే వారి మనోవేదన వర్ణనాతీతం. ప్రకాశం బ్యా రేజి దిగువన సాగర సంగమం వరకు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన సు మారు 54కి పైగా ఘాట్లలో జలం లేదు. పుణ్యఫలం దక్కదని భక్తుల ఆం దోళన దృష్టిలో పెట్టుకుని ప్రతామ్నాయ మార్గాలతో ఆకట్టుకునే ప్రయత్నాల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. 
కృష్ణా జిల్లా  కేంద్రం బందరుకు ప్రధాన కాలువ ద్వారా కృష్ణా నది నీరు వచ్చే అవకాశం లేదు. కాలేఖాన్‌పేట సమీప నాగులేరులో మున్సిపల్‌ అధికారులు ట్యాంకర్లతో నీటిని తెచ్చిపోశారు. మంత్రి కొల్లు రవీంద్ర నియోజకవర్గం కావడంతో అత్యుత్సాహంతో నదిలో పుష్కర స్నానాన్ని కాలువలో చేయించాలని భావించారు. దాదా పు 20 నీటి ట్యాంకర్లు పోసినా నాగులేరు కాలువలో స్నానాలకు  నీరు సరిపడేలా లేదు. అధికార యంత్రాంగం రెం డు రోజుల వృధాప్రయాసకు తెరదించారు. 
ప్రకాశం బ్యాకేజి ఎగువన దుర్గాఘాట్, పున్నమిఘాట్‌లలో నీరు సమృద్ధిగానే ఉంది. దిగువన కృష్ణవేణి ఘాట్, పద్మావతి ఘాట్‌లో నీరు తగి నంత లేదు. దాదాపు 2.1 కిలోమీటర్లు చిన్న పిల్ల కాలువలో కాంక్రీట్‌ ఫ్లోరింగ్‌ చేసి ఇసుక బస్తాలతో గట్టు వేసి నీరు వదులుతున్నా అవి మొదటి రోజు మోకాలి లో తు రావడమే గగనమైంది. రెండో రోజు నడుం వరకు వచ్చేలా విడుదల చేశారు. భక్తులు అసంతృప్తికి లోనవుతుండటంతో కృష్ణవేణి, పద్మావతి ఘాట్లలలో జల్లు(షవర్‌)స్నానాలు ఏర్పాటు చేశారు. 
విజయవాడకు దిగువన యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం, మద్దూరు ఘాట్లలోను విచిత్ర పరిస్థితి నెలకొంది. నదిలో గతంలో ఇసుక తవ్వకాలతో ఏర్పడిన గుంతల్లో నిలిచిన నీటితో పుష్కరస్నానం అయ్యిందనిపిస్తున్నారు. మురికినీటిలో రోగాల బారిన పడతామనే జల్లు స్నానాలు చేస్తున్నారు. అవనిగడ్డ(దివిసీమ) ప్రాంతంలో కొత్తపేటలో జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. తీర ప్రాంతంలోని కృష్ణా నది పాయలో సముద్రపు పోటుకు వచ్చే నీటిని గజ ఈతగాళ్లు డబ్బాలతో తెచ్చి ఇస్తే భక్తులు నెత్తిన పోసుకుంటున్నారు. గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో బోరువేసి మోటారు ద్వారా జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యాకేజీ దిగువన గుంటూరు జిల్లాలో చాలా ఘాట్లలో కనీసం జల్లు స్నానాలు కూడా లేని పరిస్థితి నెలకొనడం కొసమెరుపు.  
 

Advertisement
Advertisement