నూతన ‘ఆశయం’ సిద్ధించేనా? | Sakshi
Sakshi News home page

నూతన ‘ఆశయం’ సిద్ధించేనా?

Published Wed, Aug 24 2016 10:48 PM

నూతన ‘ఆశయం’ సిద్ధించేనా? - Sakshi

–  రూ.3,315 కోట్లతో ‘ఎన్టీఆర్‌ ఆశయం’ ప్రాజెక్టు
–  ‘ప్రాజెక్టు అనంత’కు మంగళం.. కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం


అనంతపురం అగ్రికల్చర్‌ : ‘అనంత’లో ఆగస్టు 15న నిర్వహించిన  రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ‘ఎన్టీఆర్‌ ఆశయం’ పేరిట జిల్లాకు వరాల జల్లు కురిపించారు. ఈ  నేపథ్యంలో ‘అనంత’ వ్యవసాయాన్ని, రైతుల స్థితిగతులను సమూలంగా మార్పు చేసేలా వ్యవసాయ, పట్టు, పాడి, ఉద్యానశాఖల అధికారులు రెట్టించిన   మూడేళ్ల ప్రణాళికలు సిద్ధం చేశారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రూ.7,676 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ‘ప్రాజెక్టు అనంత’ మాదిరిగా ప్రాథమిక వ్యవసాయ రంగానికి సంబం«ధించి మరో బహత్తర అభివద్ధి ప్రణాళిక ఇది.

ప్రాజెక్టు అనంత నిర్వీర్యం
దేశంలో అత్యున్నత సంస్థగా పేరున్న భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్‌) పరిధిలో పనిచేస్తున్న 19 మంది వ్యవసాయ నిపుణుల బందం (హైపవర్‌ టెక్నికల్‌ కమిటీ) 2012 సంవత్సరంలో జిల్లాలో రెండు సార్లు పర్యటించి అధ్యయనం చేసిన తర్వాత వ్యవసాయాభివద్ధికి కీలక సిఫారసులు చేసింది. దాని ఆధారంగా 2013లో 14 ప్రభుత్వ శాఖలను భాగస్వాములను చేస్తూ రూ.7.676 కోట్లతో ‘ప్రాజెక్టు అనంత’ అనే బహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2014 జనవరి 2న స్థానిక రైతుబజార్‌లో ఆర్భాటంగా  కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇప్పటి అధికార పార్టీ నేతలు బీకే పార్ధసారధి, పల్లె రఘునాథ్‌రెడ్డి, మెట్ట గోవిందరెడ్డి తదితరులు ప్రజాప్రతినిధులుగా హాజరై ప్రభుత్వాలు మారినా జిల్లా శ్రేయస్సును దష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు అనంతను ముందుకు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ లోగా 2014లో ఎన్నికలు రావడం,   అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో ప్రభుత్వాలు మారాయి.  చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుబజార్‌లో ఏర్పాటు చేసిన కార్యాలయం మూతబడింది.

నూతన   ప్రణాళిక ఇలా..?
తాజాగా ‘ఎన్టీఆర్‌ ఆశయం’ పథకం పేరుతో వ్యవసాయ అనుబంధాలకు చెందిన నాలుగు శాఖల ఆధ్వర్యంలో రూ.3,314.54 కోట్ల భారీ బడ్జెట్‌తో మూడేళ్ల ప్లాన్‌ సిద్ధం చేశారు. వ్యవసాయానికి సంబంధించి ప్రస్తుతం  రూ.10,742 కోట్లు ఆదాయం లభిస్తుండగా వచ్చే మూడేళ్లలో రూ.20 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా ప్రణాళికలు రచించారు. రూ.1,038.53 కోట్లతో వ్యవసాయశాఖ, రూ.1,428.71  కోట్లతో ఉద్యానశాఖ , రూ.776.8 కోట్లతో పశుసంవర్ధకశాఖ ప్రణాళిక తయారు చేశారు.త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆయా శాఖల కమిషనరేట్, డైరెక్టరేట్లకు పంపనున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement