డీ వార్మింగ్‌ మాత్రలు అందించాలి | Sakshi
Sakshi News home page

డీ వార్మింగ్‌ మాత్రలు అందించాలి

Published Wed, Aug 3 2016 12:11 AM

డీ వార్మింగ్‌ మాత్రలు అందించాలి

  • డీఎంహెచ్‌ఓ సాంబశివరావు
  • ఎంజీఎం : జిల్లా వ్యాప్తంగా ఈనెల 10వ తేదీన నిర్వహించే డీవార్మింగ్‌ డే కార్యక్రమంలో భాగంగా 19 ఏళ్లలోపు ఉన్న పిల్లలు, విద్యార్థులకు డీ వార్మింగ్‌ (నులి పురుగుల నిర్మూలన) మాత్రలు అందించాలని డీఎంహెచ్‌ఓ సాంబశివరావు వైద్య సిబ్బందికి సూచించారు. ఈ మేరకు మంగళవారం వరంగల్‌లోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌ లో సీనియర్‌ పబ్లిక్‌ హెల్‌ ఆఫీసర్స్, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, కమ్యూనిటీ ఆర్గనైజర్లకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నులిపురుగుల కారణంగా చిన్నపిల్లల్లో రక్తహీనత, పోషకహార లోపం, ఆకలి మందగించడం, కడుపునొప్పి సమస్యలు తలెత్తుతాయన్నారు. నులిపురుగులతో చదువులో వెనుకబడడంతో పాటు చురుకుదనం తగ్గి పాఠశాలకు హాజరుకారన్నారు. వైద్య సిబ్బంది పిల్లలు, విద్యార్థులందరికీ తప్పకుండా డీ వార్మింగ్‌ మాత్రలు అందించాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీఎంహెచ్‌ఓ శ్రీరాం, జబ్బార్, కోఆర్డినేటర్‌ శ్యామనీరజ, డీఐఓ హరీష్‌రాజు, ఐడీఎస్‌పీ వైద్యాధికారి కృష్ణారావు, డెమో అశోక్‌రెడ్డి, డిప్యూటీ డెమో స్వరూపరాణి, నాగరాజు హెల్త్‌ ఎడ్యుకేటర్‌ అన్వర్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement