అమ్మోరి కోసం | Sakshi
Sakshi News home page

అమ్మోరి కోసం

Published Fri, Aug 5 2016 11:55 PM

ఆలయాల వద్దకు పొంగళ్ళు పెట్టేందుకు వెళ్తున్న వుహిళలు

కొంగు నడుముకు చుట్టిన మహిళలు. నైవేద్యం వస్తువులు నింపిన పెద్దపాత్రలు తలపై ఉంచుకుని పొలం గట్లపై వెళుతున్నారు. ఈ దృశ్యాలు పల్లెలకు మాత్రమే సొంతం. కాలం మారుతున్నా, పల్లెసీమల్లో ఆచార వ్యవహారాలకు జీవం పోస్తున్నారు. పాత కాలం నాటి పద్ధతుల్లోనే శెట్టిపల్లెకు చెందిన మహిళలు శుక్రవారం అక్కదేవర్లకు పూజాదికాలు అందించడానికి వెళుతూ ఇలా కనిపించారు. గ్రామపొలిమేరలకు వెళ్లిన మహిళలు పొంగళ్లు పెట్టి, అమ్మవారికి సమర్పించారు. వర్షాలు సవుృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని వేడుకున్నట్లు పేర్కొన్నారు. ఏటా ఆనవాయితీగా ఈ తరహా పూజలు చేస్తారు.
– బైరెడ్డిపల్లె

Advertisement

తప్పక చదవండి

Advertisement